భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం. కశ్శీర్ కు సంబంధించి చాలామందికి చాలానే అపోహలు ఉండొచ్చు. కానీ.. ఆ నేలలో వెల్లివిరిసే మత సామరస్యం ఇప్పటికి కనిపిస్తుంది. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా.. దాని వెనుక దుష్ట శక్తుల ప్రభావమే తప్పించి.. కాశ్శీరీల మనసు వెన్న అని చెప్పాలి.
కాశ్శీర్ వ్యాలీలో మత సామరస్యం ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. భారత్.. పాక్ సరిహద్దులకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో వైభంగ్ అనే గ్రామం ఉంది. ఇక్కడ వెయ్యి ముస్లిం కుటుంబాలు ఉంటాయి. ఇక.. హిందువులు కేవలం అరంటే.. ఆరు కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఇప్పటికి తీవ్రవాదుల పలుమార్లు బెదిరించారు. ఉన్న ఊరును విడిచి వెళ్లిపోవాలని.. లేకుంటే చంపేస్తామని హెచ్చరించారు. కానీ.. అక్కడున్న కుటుంబాలు బెదరక అలానే జీవిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆ గ్రామంలో నివసిస్తున్న ఆరు కుటుంబాల్లో రామ్ జీ కౌల్ అనే 78 ఏళ్ల పెద్ద మనిషి ఇటీవల మరణించారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. మరణించిన మనిషికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం హిందువు కుటుంబాలకు ఆసరా లేదు. అయితే.. ఆ లోటును భర్తీ చేస్తూ.. గ్రామానికి చెందిన ముస్లింలంతా ఏకమయ్యారు. కౌల్ ఇంటికి చేరుకొని.. కుటుంబానికి ధైర్యం చెప్పి దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అంతేకాదు.. కౌల్ మరణ వార్త విని వచ్చిన బంధువులను కూడా తమ ఇళ్లల్లో ఉంచుకొని చనిపోయిన కుటుంబం పట్ల తమకున్న ప్రేమాభిమానాలు చాటారు. హిందూ.. ముస్లింల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణగా చెబుతుంటారు. మతాలతో సంబంధం లేకుండా తమ అందరికి పెద్ద దిక్కులాంటి కౌల్ మరణం పట్ల స్థానిక ముస్లింలు తీవ్ర వేదన చెందుతున్నారు. పెద్ద దిక్కులాంటి కౌల్ ఏం చెబితే అదే తమకు ఫైనల్ అని.. తమకు మనుషులే కానీ.. వారి మతంతో సంబంధం లేదంటూ చెబుతున్న వైభంగ్ గ్రామ ముస్లింల మాటలు వింటే.. ఇదీ భారత్ అంటే అని అనిపించక మానదు.