అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో ముస్లిం ఎమ్మెల్సీ ఒకరు కీలక ప్రకటన చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యూపీ రాష్ట్ర ముస్లిం ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ అయోధ్యలో మందిరం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాముని మందిరం నిర్మాణం కోసం రూ 15 కోట్లు విరాళంగా ఇస్తానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
లక్నోలో జరిగిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సమర్థించారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడు కనుక, మందిరాన్ని అక్కడే నిర్మించాలని బుక్కల్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంచే భూ నష్టపరిహారం కింద ఎమ్మెల్సీ బుక్కల్‌కు రూ.30 కోట్లు అందనున్నాయి. అయితే ఆ మొత్తం వచ్చిన తర్వాత అందులో రూ.15 కోట్లు మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సొమ్ములను మందిరం నిర్మాణం కోసం ఉపయోగించాలని కోరారు.