ప్లేబాయ్ అయితే న్యూడ్..లేదంటే మొత్తానికి ఇలా!

Update: 2016-09-29 19:30 GMT
మేగజైన్స్ లందు ప్లేబాయ్ మేగజైన్ వేరయా.. అనేది చాలామందికి తెలిసిన విషయమే. 1953 లో హుగ్ హెప్నర్ సారధ్యంలో, ఆ ఏడాది డిసెంబర్ నెల ఇష్యూతో మొదటిసారిగా మార్కెట్ లోకి వచ్చిన ఈ మేగజైన్.. నాటి నుంచి నేటి వరకూ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. తొలి సంచిక సెంటర్ పేజ్ లో మార్లిన్ మన్రో న్యూడ్ ఫోటోతో మొదలైన ప్లే బాయ్ సంచలనాలు నేటికీ అవిరామంగా కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకూ న్యూడ్ మోడల్స్ తన కవర్ పేజీని, సెంటర్ స్ప్రెడ్ ని నింపేసిన ఈ మేగజైన్ తాజాగా ఒళ్లంతా బట్టలు కప్పుకున్న అమ్మాయి ఫోటోను ప్రచురించింది.

న్యూడ్ మోడల్స్‌ కు - సాఫ్ట్ పోర్న్‌ కు పేరెన్నికగన్న ప్లేబాయ్ మేగజైన్ తన తీరు మార్చుకుందో లేక రొటీన్ కి భిన్నంగా ప్రయత్నించాలనుకుందో కానీ మొట్టమొదటిసారిగా ఓ వెరైటీ ఫోటోను ప్రచురించింది. నిత్యం చిన్న చిన్న పీలికలను దుస్తులుగా దరించిన అమ్మాయిల ఫోటొలు ప్రచురించే ఈ మేగజైన్ ఈసారి మాత్రం... తలపై స్కార్ఫ్ ధరించిన ముస్లిం యువతి ఫోటోను అక్టోబర్ సంచికలో ప్రచురించింది.

బ్లాక్ లెదర్ జాకెట్ - జీన్స్ - హెడ్ స్కార్ఫ్ తో కనిపిస్తున్న ఈమె టాగౌరి అనే అమెరికన్ జర్నలిస్ట్ - వయసు 22 ఏళ్లు. ఈమె న్యూసీ అనే వీడియో న్యూస్ నెట్‌ వర్క్‌ కి రిపోర్టర్‌ గా పనిచేస్తోంది. సరేలే ప్లేబాయ్ లో ఇలాంటి మార్పు రావడం మంచిదే అని కొందరు అనుకుంటుంటే... ప్లేబాయ్ వంటి మేగజైన్‌ లో ఈమె ఫోటోని చూసిన మరికొంతమంది మాత్రం నిప్పులు చెరుగుతున్నారట. ముస్లిం మహిళను ఒక పోర్న్ పత్రికలో ఇలా చూపుతారా అంటూ మండిపడుతున్నారట. ఏది ఏమైనా.. ప్లేబాయ్ ప్రస్థానంలో ఇది మరో మలుపేనేమో!!
Tags:    

Similar News