కరోనా పై పోరులో దేశంలోని చాలామంది మతాలు, సంప్రదాయలను పక్కన పెట్టి మానవత్వం చాటుకుంటున్నారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ఈ కరోనా సంక్షోభ సమయంలో తమ మానవత్వం చాటుతున్నారు. గత రెండు నెలలుగా దేశంలో మాత విద్వేషాలు చెలరేగుతున్న వేళ నార్త్ ఢిల్లీలో కూడా ఓ ముస్లిం మహిళ చేసిన పనికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గుడి - మసీదు - గురుద్వారా అనే తేడా లేకుండా బుర్కా ధరించి శానిటైజర్ ట్యాంక్ భుజానికి వేసుకొని తన బాధ్యలను నిర్వహిస్తోంది. నవదుర్గా ఆలయంలో ఆమె శానిటైజ్ చేస్తుండగా.. తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాలు చూస్తే ... CAAపై ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లను శాంతపరచాలని ఏడో తరగతి వరకే చదువుకున్న ఇమ్రానా కృషి చేస్తుంది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కలిసి కరోనా వారియర్స్ టీం గా రెడీ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. శానిటైజేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో శానిటైజ్ చేస్తోంది. తాను బుర్కాలో వెళ్లినా కూడా గుడిలో - గురుద్వారాలో - మసీదులో ఎవరూ తనకు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. మత సామరస్యాన్నికాపాడటానికే తాను ఇలా చేసినట్టు వెల్లడించారు.
చాలా మంది మత గురువులు ఆలయాల్లోకి స్వాగతం పలికారని చెప్పారు. తాను మసీదు నుంచి వచ్చే అజాన్, గుడి నుంచి వినిపించే గంట శబ్దాలకు ఒకేలా స్పందిస్తామని అంటున్నారు. భారత్ లో ఉన్న సెక్యూలర్ వ్యవస్థను కాపాడాలని అన్నారు.కాగా ఇమ్రానా భర్త నియామత్ అలీ ప్లంబర్ గా పని చేస్తున్నాడు. ఇమ్రానా కూడా ఏదో ఒక పని చేసు కుంటూ జీవిస్తోంది. ముగ్గురికి తల్లి అయిన మహిళ పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు పాటిస్తూనే స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ట్యాంక్ తో ఇలా స్వచ్ఛందంగా శానిటైజేషన్ చేస్తుంది.