రావెలకు వ్య‌తిరేకంగా సంఘాల ఆందోళ‌న‌

Update: 2016-12-24 15:45 GMT
ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు - టీడీపీకి చెందిన గుంటూరు జెడ్పీ ఛైర్‌ పర్సన్ జానీమూన్ మధ్య వివాదం ముదిరిపాకాన ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వివాదం ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాత్ర‌మే ఈ వివాదం కొన‌సాగగా...తాజాగా ముస్లిం సంఘాలు - ద్వితీయ శ్రేణి నాయ‌కులు సైతం రంగంలోకి దిగారు. జడ్పీ ఛైర్‌ పర్సన్‌ జానీమూన్‌ కు మద్దతుగా గుంటూరులో ముస్లిం సంఘాలు ఆందోళన చేప‌ట్టాయి. మంత్రిపై చర్య తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు స్ప‌ష్టం చేశాయి. పార్టీ కోసం ప‌నిచేస్తున్న మ‌హిళా నాయ‌కురాలిని ఇబ్బంది పెట్టేలా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న మంత్రి వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని ముస్లిం సంఘాలు మండిప‌డ్డాయి. మంత్రి ఇబ్బందిక‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌న విష‌యంలో ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌గు చ‌ర్య‌లు తీసుకోకుంటే ఆందోళ‌న ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించాయి.

ఇదిలాఉండ‌గా...మంత్రి రావెల కిశోర్ బాబుకు మద్దతుగా ప్రత్తిపాడు టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జడ్పీ ఛైర్‌ పర్సన్  భర్త అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఈ విధానాల‌ను వ‌దులుకోవాల‌ని మంత్రి రావెల సూచిస్తే జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌ జానీమూన్ వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేశార‌ని టీడీపీ ప్ర‌త్తిపాడు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీకి చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చేలా అవినీతికి పాల్ప‌డ‌ట‌మే కాకుండా...ఉద్దేశ‌పూర్వ‌కంగా విమ‌ర్శ‌లు చేయ‌డం జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కు త‌గ‌ద‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా... గుంటూరు జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ జానీమూన్ - సాంఘికసంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌ బాబు మధ్య విభేదాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకి సూచించారు. జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి చినరాజప్ప - టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి - గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంత్రి రావెల కిషోర్ బాబు - జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ పార్టీలోకి కొత్తగా వచ్చినవారేనని, ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభించిందన్నారు. ఇరువురు పార్టీ క్రమశిక్షణకు అనువుగా వ్యవహరించాలన్నారు. గుంటూరు జిల్లాలో సమన్యాయం కోసం ఇరువురికి పదవులు ఇస్తే.. ఇలా వివాదాలతో పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించడం సరైంది కాదన్నారు. వ్యక్తిగత విషయాలతో ఇలాంటి వివాదాలు తెచ్చుకోవడం సరైంది కాదని సూచించారు. పార్టీ సిద్దాంతాలు గౌరవించాలని - క్రమశిక్షణను పాఠించాలని కోరారు. చర్చలతో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని పార్టీ అధ్యక్షుడు సూచించారు.  పార్టీలో ఎవరైనా పార్టీ విలువలు, క్రమశిక్షణ తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News