అయోధ్యలో రామమందిర నిర్మాణంపై మరోసారి చర్చ మొదలైన సమయంలో కొందరు ముస్లింలు ఓ లారీ నిండా ఇటుకలు తీసుకురావడం చర్చనీయాంశమైంది. ముస్లిం కరసేవక్ మంచ్ (ఎంకేఎం)కు చెందిన పలువురు అయోధ్యకు వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆ ముస్లిం కరసేవకులు ఇటుకలు తేవడం అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రామమందిర నిర్మాణంలో తమ వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ఇటుకలు తీసుకొచ్చామని ఆ మంచ్ అధ్యక్షుడు ఆజం ఖాన్ చెప్పారు. లక్నో - బస్తీ - ఇతర జిల్లాల నుంచి తాము వచ్చినట్లు ఆ బృంద సభ్యులు తెలిపారు.
రామ్ లాలా ఆలయ ఆవరణలోకి వాళ్లు ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ ఆలయాన్ని మూసివేయడంతో పోలీసులు అనుమతించలేదు. దీంతో స్థానిక విశ్వహిందూ పరిషత్ సభ్యులకు ముస్లిం కరసేవక్ మంచ్ సభ్యులు ఆ ఇటుకలను ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా అధికారులు వారిని వాళ్ల ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యే లక్నోలో రామమందిర నిర్మాణానికి మద్దతుగా మంచ్ అధ్యక్షుడు ఆజంఖాన్ పోస్టర్లు వేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా ఇటుకలు తెచ్చి మరింత ఆశ్చర్యపరిచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/