తీవ్రవాదం గురించి చర్చకు వచ్చినప్పుడల్లా..దురదృష్టవశాత్తు అందులో ముస్లింల ప్రస్తావన వస్తుంది. ``ముస్లింలందరినీ తీవ్రవాదులుగా ఎందుకు భావిస్తారు?` అని కొందరు ప్రశ్నిస్తుంటే...దాన్ని అంగీకరిస్తూనే...``తీవ్రవాదుల్లో మెజార్టీ ముస్లింలే కదా?`` అని ఇంకొందరు లాజిక్ పాయింట్ తెరమీదకు తేవడం అనేది అనేక చర్చాగోష్టిల్లో సహజంగా కనిపించే అంశం. ఇలా అనేక చర్చోపచర్చలకు తెరపడేలా అన్నట్లుగా తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాదం గురించి వెల్లడించారు.
షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన వసీం రిజ్వి సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలో ఆయన మదర్సా పాఠశాలలు టెర్రరిస్టులను ఉత్పత్తి చేస్తున్నాయని కలకలం రేపే కామెంట్లు చేశారు. దేశంలో ఉన్నటువంటి మదర్సాలను సీబీఎస్ ఈ - ఐసీఎస్ ఈకి అనుబంధ విద్యాసంస్థలుగా మార్చాలని కోరుతూ వజీం రిజ్వి ప్రధాని నరేంద్రమోదీ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖలు రాశారు. మదర్సాలలో చదివిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని రిజ్వి తెలిపారు. ఇప్పటి వరకు మదర్సా పాఠశాలలు ఎంత మంది ఇంజినీర్లను - డాక్టర్లను - ఐఏఎస్ ఆఫీసర్లను దేశానికి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. మదర్సాలలో ముస్లింయేతర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు. మతపరమైన విద్యా బోధన జరగాలన్నారు.
ఇక తాజాగా ఆయన స్పందిస్తూ ఇస్లాంలో గడ్డం పెంచుకోవడం ఓ సాంప్రదాయమని వసీమ్ రిజ్వి తెలిపారు. మీసం లేని గడ్డం పెంచుకునేవాళ్లతోనే ప్రమాదమని, ప్రపంచవ్యాప్తంగా వీళ్లే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని రిజ్వి అన్నారు. ``మీసం లేకుండా గడ్డం పెంచే ముస్లింలు చాలా భయంకరంగా ఉంటారు. ఇలాంటి ముస్లింలే తీవ్రవాదులు. ప్రపంచవ్యాప్తంగా వీళ్లే ఉగ్రదాడులు చేస్తున్నారు. ప్రజల్లో ఒకరకమైన భయాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతోనే వాళ్లు ఇలా మీసం లేకుండా గడ్డం పెంచుతారు`` అని రిజ్వి చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్లే షరియత్ పేరుతో ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఫత్వాలు జారీ చేస్తుంటారని ఆయన విమర్శించారు. ఈ మధ్య కేరళలో ఓ ముస్లిం యువతి గంధం బొట్టు పెట్టుకున్నందుకు మదరసా నుంచి బయటకు పంపించిన ఘటనపై స్పందిస్తూ.. `ఈ దేశంలో పెళ్లయిన మహిళలు ఇలా సిందూరం ధరించడం సాంప్రదాయం. ఇదేమీ చేయకూడని పనేమీ కాదు`` అని రిజ్వి స్పష్టంచేశారు. ఫత్వాలు జారీ చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే మత పెద్దలపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి ఆయన పిలుపునిచ్చారు.