ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా.. కొందరు అనుసరించే విధానాలు కొత్తగా ఉండటమే కాదు.. మిగిలిన వారు సైతం స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి పనినే చేశారు తెలంగాణ అధికారపక్షానికి చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన తన నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయితీకి రూ.3.86 లక్షల మొండి బకాయిలు ఉన్నాయని.. ఎంతకూ కట్టటం లేదన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆగ్రహం చెందారు.
బకాయిల్ని వసూలు చేయరెందుకని అధికారుల మీద ఫైర్ కాకుండా.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. బిల్ కలెక్టర్ గా రంగంలోకి దిగిన ఆయన.. మొండిబకాయిలు ఉన్న దుకాణాల దగ్గరకు వెళ్లారు. పన్ను బకాయిలు ఎందుకు ఉన్నాయని అడగటంతో పాటు.. వసూలుకు రంగంలోకి దిగారు. రెండు గంటల వ్యవధిలో ఆయన రూ.70వేల మొత్తాన్ని కలెక్షన్ చేశారు.
పన్నులు చెల్లించని కొన్ని దుకాణాల్ని మూయించిన ఎమ్మెల్యే.. మిగిలిన బకాయిల్ని సైతం తానే స్వయంగా వసూలు చేసి పంచాయితీకి అందిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అన్న దర్పం ప్రదర్శించకుండా.. పంచాయితీకి పెండింగ్ ఉన్న బకాయిల వసూళ్ల విషయంలో ముత్తిరెడ్డి అనుసరించిన విధానం బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముత్తిరెడ్డి మాదిరే మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గంలోని మొండి బకాయిల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే.. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించే వీలుంటుంది.