ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనను అత్యంత వైభవంగా జరపటంతో పాటు.. అందరిని భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి ఆయన సిద్ధంగా లేరు. అమరావతి నిర్మాణంలో సీమాంధ్రులంతా భాగస్వామ్యం కావాలన్న భావనలో ఉన్న బాబు.. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఇటుకనైనా దానం ఇవ్వాలని పదే పదే పిలుపునిస్తున్నారు.
మరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకున్నట్లు అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుకనైనా ఇవ్వాలంటే ఎలా అన్న సందేహానికి సమాధానం ఇప్పుడు వచ్చేసింది. నా ఇటుక.. నా అమరావతి (మై బ్రిక్.. మై అమరావతి) అన్న నినాదంతో ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేశారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఓపెన్ చేసిన ఈ వెబ్ సైట్ గురించి.. టీవీల్లో భారీ బ్రేకింగ్స్ వచ్చాయి. ‘‘మై బ్రిక్.. మై అమరావతి’’ పేరు మీద ఏపీ ముఖ్యమంత్రి వెబ్ సైట్ ఓపెన్ చేశారని.. ప్రతి ఇటుకకు రూ.10 చొప్పున చెల్లించి అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ వెబ్ సైట్ గురించి టీవీల్లో చూసిన వారు మై బ్రిక్.. మై అమరావతి అంటే ఓపెన్ కాని పరిస్థితి. మరోవైపు.. సింగపూర్ కు చెందిన ప్రవాసాంధ్రుడు 108 ఇటుకల్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో.. అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకున్న ఎంతో మంది సీమాంద్రులకు వెబ్ సైట్ ను ఎలా రీచ్ కావాలో అర్థం కాని పరిస్థితి.
అయితే.. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారంలో లోపంలో కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి మై బ్రిక్.. మై అమరావతి అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తే ఎలాంటి ఫలితం రాని పరిస్థితి. అయితే.. ఈ సైట్ ఓపెన్ కావాలంటే సెర్చ్ చేయాల్సిన లింకు.. ద్వారా అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునే వీలుంది. ఈ కథనాన్ని రాస్తున్న సమయానికి 654 మంది మొత్తం 1,09872 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం కానీ వెబ్ సైట్ కు సంబంధించి సమాచారం సరిగా ఇచ్చి ఉంటే మరింత జోరుగా నా ఇటుక.. నా అమరావతి కార్యక్రమం ఉండేదన్న మాట వినిపిస్తోంది. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని భావించే వారంతా ఈ http://amaravati.gov.in/index.aspxhttp://amaravati.gov.in/index.aspx లింకులోకి వెళితే సరి.