ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘మింత్రా’ తన లోగోను మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ సంస్థ లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైంది. ఆడువారి మనోభావాలు దెబ్బతీసేలా లోగో ఉందంటూ ఈ కామర్స్ సంస్థ ‘మింత్రాపై ఓ సామాజిక కార్యకర్త కోర్టు మెట్లు ఎక్కగా.. లోగోను మార్చాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ గత ఏడాది డిసెంబర్ లో ముంబై సైబర్ క్రైం పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు. అది అభ్యంతరకంగా ఉందని.. మహిళను అవమానపరిచేలా ఉందని ఆరోపించారు. వెంటనే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
పటేల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో తమను కలవాలంటూ మింత్రా అధికారులకు నోటీసులు పంపారు. నెలలోపే లోగోను మార్చేస్తామని వారు తమకు హామీ ఇచ్చారని ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ తెలిపారు.
తాజాగా మింత్రా కొత్త లోగోను కూడా రివిల్ చేసింది. మింత్రా తన లోగోలో కొన్ని మార్పులు చేసింది. వెబ్ సైటలోనూ.. యాప్ లో కూడా లోగోను మార్చుతున్నట్టు మింత్రా ప్రకటించింది. ప్యాకేజింగ్ మెటీరియల్ పైనా కూడా లోగోను మారుస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
దేశంలో ఉపకరణాలు, బట్టల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ఈ మింత్రా ఈకామర్స్. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్లలో మింత్రా ఒకటి. 2020 లో వెబ్‌సైట్ ట్రాఫిక్‌లో 51 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వార్షిక శీతాకాలపు అమ్మకం ద్వారా మింత్రా ఇటీవల భారీగా లాభపడింది.