ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా బోగీలకు నిప్పు పెట్టారా?

Update: 2015-04-15 06:27 GMT
శేషాచల అడవుల్లో జరిగిన ఎర్రచందనం దొంగల్ని ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనకు నిరసన హింసాత్మకంగా మారుతోందా? అనే ప్రశ్నకు అవుననే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం చెన్నైలోని గుమ్మడిపూడి నుంచి గూడూరుకు బయలుదేరిన ప్యాసింజర్‌ రైలులో బోగీలు అగ్ని ప్రమాదానికి గురి కావటం తెలిసిందే. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తొలుత భావించినా.. బోగీల్లో అగ్ని ప్రమాదం అలాంటిది కాదని.. కావాలనే చేశారన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. కాలిన బోగీల్ని పరిశీలించిన అధికారులు ప్రాధమికంగా వచ్చిన అంచనా ప్రకారం బోగీల్ని కావాలనే తగలబెట్టి ఉంటారన్న సందేమాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. బోగీలు తగలబడుతున్న విషయం తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నప్పుడు చోటు చేసుకుంది. బోగీల నుంచి పొగలు.. మంటలు వచ్చిన తర్వాత రైలు.. ఐదు రైల్వే గేట్లను దాటింది.

ఈ సందర్భంగా ఐదు రైల్వేగేట్ల సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యంతో సమాచారం ఉన్నతాధికారులకు అందలేదా? లేక.. అవగాహన లేక ఇలా వ్యవహరించారా? అన్నది విచారణలో తేలనుంది. విచారణలో భాగంగా.. అరంబాకం నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న ఐదు రైల్వే గేట్‌ మ్యాన్లను ప్రత్యేకంగా విచారించాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News