చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన మైసూరా

Update: 2016-11-05 14:50 GMT
రాజకీయాల్లో విలువలున్న నేతగా... చట్టం - న్యాయం - ధర్మం అన్నీ తెలిసినవాడిగా పేరున్న మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు ఓటుకు నోటు అన్నది కేసే కాదని మైసూరారెడ్డి చెప్పారు. చంద్రబాబు ఆడియో టేపుల్లో తప్పు ఏముందని ప్రశ్నించారు. డబ్బులిస్తా… ఓటు వేయండి అని చంద్రబాబు అడినట్లుగా ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఆ టేపు ఆధారంగా కేసు నిలవదన్నారు. అది పెద్ద కేసు కానేకాదని... దాని కోసం చంద్రబాబు కేసీఆర్ తో రాజీపడ్డారనడం సిల్లీగా ఉందన్నారు.

మరోవైపు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్రభావాన్ని అప్పుడే అంచనా వేయలేమన్నారు. ఆ విషయాన్నే ఆయన సరదాగా చెబుతూ.. పవన్ ప్రస్తుతం ఇంట్లోనే భరత నాట్యం వేస్తున్నాడని, ఆయన స్టేజ్‌ మీదకు వచ్చి భరత నాట్యం చేస్తే అప్పుడు అది బాగుందో లేదో చెప్పగలమన్నారు.

వచ్చే ఎన్నికల్లో కుమారుడిని పోటీ చేయించే అంశంపైనా ఆయన మాట్లాడారు. నియోజవకర్గాల పెంపు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకుని నిర్ణయం తీసుకుంటానన్నారు. చట్టంలో చెప్పారు కాబట్టి నియోజకవర్గాలు పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కమలాపురంలో తన వర్గం ఎక్కడికీ పోలేదన్నారు. ఎన్నికలు పెడితే ఆ విషయం తెలుస్తుందన్నారు. అయితే, చంద్రబాబును వెనకేసుకొచ్చిన ఆయన సున్నితమైన విమర్శలూ చేశారు. అసలు ఏపీలో రెవెన్యూ లోటు ఎందుకొస్తుందో చెప్పారు. 100 రూపాయల ఆదాయం వస్తుంటే 150 రూపాయలు ఖర్చు పెడితే లోటు ఉండక ఇంకేముంటుందని ప్రశ్నించారు. దీంతో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబును వెనకేసుకొచ్చినా పాలన, ఆర్తిక విధానాల విషయంలో మాత్రం చిన్నగా చురకలేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News