మైసూరా.. వస్తున్నారా?

Update: 2016-02-22 06:09 GMT
 ప్రతిపక్ష నేత జగన్ సొంతజిల్లా కడపలో ఆ పార్టీని నేలమట్టం చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టిడిపి రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసురారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారభించినట్లు సమాచారం. ఆయనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు టీడీపీలో ఉన్న ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసిన వెంటనే వైసీపీలో చేరారు. వైసీపీలో మొదట్లో క్రియాశీలంగా ఉండేవారు. కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. జగన్ ఆయనను దూరం పెట్టారన్న వాదన వినిపిస్తుంది.

 అయితే... వైసీపీలో ఉన్నా లేనట్లే ఉన్న మైసూరా కొద్దికాలం కిందట రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీ లేదా వేదిక ప్రారంభిం చాలని ప్రయత్నించారు. ఆ మేరకు వివిధ పార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఎందుకో మళ్లీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వ్యూహరచయిత - పార్లమెంటు చట్టాలు - రాజ్యాంగంపై అవగాహన ఉన్న మైసురా రెడ్డి తిరిగి తన పార్టీలోకి వస్తే, కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఆ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.    

మరోవైపు మైసురా రెడ్డి పార్టీలో చేరితే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా టిడిపిలోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. రఘురామిరెడ్డి - ఆదినారాయణరెడ్డి రాజకీయంగా మైసురా సలహాలు పాటించి నిర్ణయాలు తీసు కుంటారన్న విషయం తెలిసిందే. రఘురామిరెడ్డితో ఇప్పటికే రాజ్యసభ సభ్యు డు సీఎం రమేష్ తదితరులు చర్చలు జరుపుతున్నారు. ఆది నారాయణరెడ్డి ని పార్టీలోకి తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించిన సీఎం రమేష్ ... మైదు కూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని తీసుకువచ్చేందుకూ చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా, ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరితే, కడప జడ్పీ చైర్మన్ టిడిపి వశమవుతుందన్న ధీమా వ్యక్తమవుతోంది. కడప జడ్పీ సాధిస్తే, జగన్ మీద సొంత జిల్లాలో తొలిదెబ్బ తీసినట్లే.
Tags:    

Similar News