వైసీపీలోకి మాజీ స్పీక‌ర్ ?!

Update: 2017-05-05 06:51 GMT
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం జోరందుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య నేత‌లు - మాజీ మంత్రులు వైసీపీ కండువా క‌ప్పుకోగా తాజాగా  మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు తనయుడు - మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆయ‌న త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

గుంటూరు జిల్లాకు చెందిన మనోహర్‌ దీర్ఘకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. అయితే రాష్ట్ర  విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ పార్టీ కుదేలు అవ‌డం, అదే స‌మ‌యంలో వచ్చే ఎన్నికల నాటికి కోలుకునే అవకాశం లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై నాదెండ్ల మ‌నోహ‌ర్ దీర్ఘాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మ‌రోవైపు సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే గడువు ఉండటంతో ఇటీవ‌ల బలం పుంజుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు గుంటూరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News