ఒక పార్టీ అన్న తర్వాత పలువురు నేతలు కలుస్తుంటారు. భేటీ అవుతుంటారు. పార్టీలోకి చేరుతుంటారు. కానీ.. మరే పార్టీలో కనిపించని సిత్రం ఒకటి తాజాగా జనసేనలో కనిపిస్తుందని చెప్పాలి. ఏదైనా పార్టీలోకి ఒక కొత్త నేత ఎంట్రీ ఇస్తే.. సదరునేత పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వేళలో ఘనంగా స్వాగతం పలికి.. ఆయన మెడలో పార్టీ కండువా కప్పి.. బాగా పని చేసుకోండి.. పార్టీని మరింత బలోపేతం చేయండన్న మాటను చెప్పటం.. అందుకు సరేనంటూ సదరు నేత తన పని తాను చూసుకోవటం కామన్.
అందుకు భిన్నమైన సీన్ ఇప్పుడు జనసేనలో కనిపిస్తోంది. ఆ మాటకు వస్తే.. జనసేనలోనూ గడిచిన కొద్ది కాలంగా పలువురు నేతలు చేరారు. వారిలో పేరున్ననేతలు.. జనాదరణ ఉన్న నేతలు.. ప్రజలకు సుపరిచితులైన నేతలు ఎంతమంది అన్నది పక్కన పెడితే.. నేతల చేరిక అయితే ఉంది.
కానీ.. మరెవరికీ దక్కని ప్రాధాన్యత పార్టీలో కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్ కు పవన్ ఇవ్వటం గమనార్హం. పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన్ను తన పక్కనే ఉంచుకోవటం.. తాను ఎక్కడికి వెళితే.. అక్కడకు తీసుకెళ్లటం చేస్తున్నారు. చివరకు భారీగా ఏర్పాటు చేసిన కవాతు సభలోనూ పవన్ తన పక్కన నాదెండ్లను ఉంచటం కనిపిస్తుంది.
తన చర్యల ద్వారా నాదెండ్ల మనోహర్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యతను పవన్ తన చేతలతో చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి. ఎందుకిలా? అంటే.. పార్టీలో ఇంతకాలం పవన్ వన్ మ్యాన్ షో నడిచేది. నిజానికి పవన్ కురాజకీయ అనుభవం తక్కువే. దీనికి తోడు.. ఇష్యూల పరంగా ఏ స్టాండ్ తీసుకోవాలి? రాజ్యంగపరమైన అంశాల విషయంలో ఆయన ఎప్పుడూ తన సన్నిహితుల మీద ఆధారపడుతుంటారు. నాదెండ్ల మనోహర్ రాకతో ఆయనకు అన్ని ఇన్ స్టెంట్ గా దొరికేస్తున్న పరిస్థితి. ఇదే.. నాదెండ్ల మనోహర్ ను పవన్ తన పక్కన ఉంచుకోవటానికి కారణంగా చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లినా తెలిసిన ముఖంగా నాదెండ్ల మనోహర్ ఉండటం.. అతనికున్న క్లీన్ ఇమేజ్ నేపథ్యంలో.. పార్టీలో ఆయనకు కీ రోల్ ఇస్తున్నానని చెప్పటానికి వీలుగా.. తన వెంట తీసుకెళుతున్నట్లుగా చెబుతున్నారు. తమ ప్రయాణంలో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు.. రెండు దఫాలు ఎమ్మెల్యేగా.. స్పీకర్ గా వ్యవహరించిన కాలంలో అనుసరించిన విధానాలు.. రాజకీయ పాఠాల్ని పవన్ కు నాదెండ్ల ట్యూషన్ గా చెబుతున్నట్లు చెబుతున్నారు.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఇంతకాలం జనసేన వేదిక మీద పవన్ మాత్రమే కనిపించే తీరుకు భిన్నంగా అధినేతతో నాదెండ్ల కలిసి కనిపించటం కొత్తగా ఉందన్న మాట వినిపిస్తోంది. నాదెండ్లతో లాభం సంగతి ఇలా ఉంటే.. ఆయన్ను పక్కన పెట్టుకొని తిరుగుతున్న తీరుతో.. ఇంతకాలం పవన్ ను మాత్రమే నమ్ముకున్న కొంతమందికి మాత్రం ఈ వ్యవహారం ఏ మాత్రం రుచించటం లేదన్నది తాజా సమాచారం.