కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు జనసేన ఓటమికి సరికొత్త కారణం చెప్పి మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు అందరికీ షాక్ ఇచ్చాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ గాలిలో టీడీపీ, జనసేన కొట్టుకుపోయింది. అయితే నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ డబ్బులు పంచకుండా.. సామాన్యులకు టికెట్లు ఇవ్వడం వల్లే ఓడిపోయామని జనసేనాని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ, టీడీపీ భారీగా డబ్బు పంచి గెలిచాయని ఆరోపించాడు..
అయితే నాగబాబు తాజాగా తమ పార్టీ ఓటమికి కారణం చంద్రబాబు.. టీడీపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతే జనసేన పార్టీని దెబ్బతీసిందని నాగబాబు విశ్లేషించారు. జనసేనపై జనాల్లో మంచి అభిప్రాయమే ఉందని..కానీ చంద్రబాబు మీద వ్యతిరేకత కారణంగా తాము గెలిస్తే మళ్లీ చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయనను సీఎం చేస్తామనే తమను కూడా ఓడించారని నాగబాబు చెప్పుకొచ్చాడు.
ఐదేళ్ల చంద్రబాబు పాలన మీద విసుగు చెందిన ప్రజలు.. టీడీపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని.. జనసేనకు ఓటేస్తే ఎక్కడ చంద్రబాబుకు లాభం కలుగుతుందోననే భయంతోనే జనసేనకు ఓట్లు వేయలేదని నాగబాబు చెప్పుకొచ్చారు.
దీన్ని బట్టి ఎన్నికల ముందు జగన్ ఆరోపించినట్టు జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ పార్టీనేనని నాగబాబు మాటలతో మరోసారి రుజువైందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.