అరుదైన అతిధులు; నాగాలు నర్సాపురం వచ్చారు

Update: 2015-07-15 11:09 GMT
అరుదైన అతిధులు గోదావరి పుష్కరాలకు వచ్చారు. ఒంటి నిండా విబూది పూసుకొని.. దిగంబరంగా ఉంటూ.. మెడలో రుద్రాక్షమాలలు ధరించి.. భగవన్మాయ స్మరణలో ఉంటూ.. తమదైన లోకంలో ఉండే నాగాలు నర్సాపురానికి వచ్చారు.

హిమాలయ పర్వత సానువుల్లో.. ప్రతికూల వాతావరణంలో బతికే అఘోరాలు గోదావరి పుష్కరాలకు వచ్చారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం వరకూ దాదాపు రెండు వేలకు పైగా నాగా సాధువులు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్దకు వస్తారన్న సమాచారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే.. వారింకా రాలేదు. అదే సమయంలో.. ఏపీలోని నర్సాపురంలోని వలంధర్ రేవుకు రావటం ఆసక్తికరంగా మారింది.

మంగళవారం రాత్రి గోదావరికి మంత్రోచ్ఛారణల మధ్య సంధ్యాహారతి ఇచ్చిన వారు స్నానం ఆచరించారు.నాగాలు ఇప్పటివరకూ నర్సాపురం వద్దకు వచ్చింది లేదు. తొలిసారి వారు రావటంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానం కోసం వచ్చిన భక్తులు సైతం.. ఈ దిగంబర స్వాముల్ని చూసేందుకు.. వారి ఆశీస్సులు పొందేందుకు ఉత్సాహం ప్రదర్శించారు.
Tags:    

Similar News