మెగా ఫ్యాన్స్ అంటే సినీ రంగాన మెగా హీరోలను అభిమానిస్తూ ఉండేవారు. వారు రాజకీయాల్లో తమకు నచ్చిన నాయకుడి వెంట నడుస్తూ వస్తున్నారు. వెండితేర మీద హీరోలు చేసే విన్యాసాలకు వారు ఫ్యాన్స్ అవుతారు. అయితే తమ సొంత ఇష్టాల బట్టి రియల్ లైఫ్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ రాజకీయాల్లో వివిధ పార్టీల అభిమానులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో చాలా మంది మెగాభిమానులు వైసీపీకి ఓటు వేశారు.
దానికి వారి చెప్పిన రీజన్ ఏంటి అంటే తాము సినిమాల్లో పవన్ని అభిమానిస్తామని, రాజకీయాలకు వచ్చేసరికి జగన్ ని ఇష్టపడతామని. అలా పవన్ ని సినిమాల్లో పవర్ స్టార్ ని చేసిన ఫ్యాన్స్ రాజకీయాల్లో మాత్రం పవర్ ఇవ్వకుండా ఝలక్ ఇచ్చేశారు. ఇక మెగాభిమానులు అన్ని పార్టీలలో ఉన్నారు. అంతదాకా ఎందుకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ తాను పవన్ కి వీరాభిమానిని అని చెప్పుకుంటారు. రాజకీయాలలో మాత్రం జగన్ తన హీరో అని చెబుతారు.
ఇక మీదట ఇలాంటి రెండు రకాల అభిమానానికి తావులేదని మెగా బ్రదర్ నాగబాబు గట్టి కాషన్ ఇచ్చేశారు. మెగాభిమానులుగా తాము గుర్తించాలీ అంటే వారు జనసేన వెంట ఉండి తీరాలని ఆయన అంటున్నారు. అలా ఉన్న వారినే తాము తమ అభిమానులుగా చూస్తామని కూడా పేర్కొంటున్నారు.
ఒక విధంగా ఇది ఫ్యాన్స్ కి ఇబ్బందే. ఇక మెగాభిమానులు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారంతా కూడా కచ్చితంగా జనసేనకే మద్దతు ఇవ్వాలన్నది జనసేన వ్యూహకర్తల ఆలోచనగా ఉందా అన్న చర్చ వస్తోంది. ఇప్పటిదాకా మెగా ఫ్యాన్స్ రాజకీయ ఇష్టాఇష్టాలను చూసి వదిలేసిన జనసేన పెద్దలు ఈసారి మాత్రం ఫ్యాన్స్ అంటే తమకే ఉండాలి. అది రాజకీయమైనా తమతోనే నడవాలని భావిస్తున్నారు అంటున్నారు.
ఈ మధ్య విజయవాడలోని ఒక హొటల్ లో జరిగిన మెగా ఫ్యాన్స్ మీటింగ్ లో కూడా జనసేనకే మెగా ఫ్యాన్స్ అంతా కట్టుబడి ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మెగా ఫ్యాన్స్ ఓట్లు అన్నీ పోలరైజ్ అయి జనసేన విజయావకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
అయితే ఇది జనసేన రాజకీయ విధానంగా ఎంత చూసుకున్నా ఫ్యాన్స్ అన్న వారు సినిమాలను చూసి ఏర్పడిన వారు, వారు రాజకీయాల్లో తమ సొంత ఇష్టాలను వదులుకుని జనసేనకే కట్టుబడాలని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్ అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తెర అభిమానం నిజ జీవితంలో కూడా కంటిన్యూ అవాలీ అంటే దానికి తగిన విధంగా ప్రజా నాయకులుగా ఎదగాలని మేధావులు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన మాత్రం ఈ విషయంలో కచ్చితంగా ఉంటోంది అని అంటున్నారు. ఇక చూస్తే మెగా ఫ్యాన్స్ ఈసారి ఏపీలో అంతా ఒక్కటిగా నిలిచి దుమ్ము రేపుతారా అన్న చర్చ కూడా వస్తోంది.