నాగ‌బాబును మ‌ళ్లీ కెలికిన బాల‌య్య‌

Update: 2019-03-31 11:58 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ మీడియా వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌. ఇల్లా ప‌బ్లిక్కా అనే తేడా లేకుండా అంత‌టా ఒకే రకంగా వ్య‌వ‌హ‌రిస్తూ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ పార్టీకి ప్ల‌స్ కావాల్సింది పోయి మైన‌స్ అవుతున్నాడు. ఆయ‌న హిందూపురం వ‌చ్చి వారం కాలేదు. అపుడే రెండు వివాదాలు సృష్టించాడు. ఒక‌వైపు జ‌గ‌న్ కు ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌, ప‌వ‌న్‌కు నాగ‌బాబు త‌దిత‌ర‌  కుటుంబ స‌భ్యులు రాజ‌కీయ అనుభవం లేకున్నా చ‌క్క‌టి వాగ్దాటితో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

కానీ లోకేష్ మంత్రి, బాల‌య్య ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్యే. అయినా కూడా సాధార‌ణ విష‌యాలు కూడా త‌ప్పుల్లేకుండా మాట్లాడ‌లేక‌పోతున్నారు. 70 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబు ప‌డుతూ లేస్తూ ప్ర‌చారం చేసుకుంటుంటే... వీరిద్ద‌రూ స‌క్సెస్ ఫుల్‌ గా బాబుకు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ప‌ర‌మానంద శిష్యుల్లాగా త‌యార‌య్యారు అని ఒక సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేశ‌కుడు వ్యాఖ్యానించారు.

ఇటీవ‌లే దండ ప‌క్క‌కు తీసి వీడియో తీశాడ‌ని... ఒక మీడియా ప‌ర్స‌న్‌ ని బండ‌బూతులు తిట్టాడు బాల‌కృష్ణ‌. బాంబులేస్తా, న‌రుకుతా అన్నాడు. చివ‌ర‌కు బాబు బెంబేలెత్తిపోయి క్లాస్ పీకిన‌ట్టున్నాడు. అందుకే ఆ మ‌రుస‌టి రోజే క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఆ త‌ర్వాత ఒక టీడీపీ కార్య‌క‌ర్త‌ను తిట్టి అత‌ను పార్టీ మారేలా చేశాడు. అస‌లే హిందూపురం ఎంపీగా పోటీ చేస్తున్న‌ సీఐ మాధ‌వ్‌ ను ఇబ్బంది పెట్టి ఇక్క‌డ ఇబ్బందులు పాల‌వుతోంది టీడీపీ. చివ‌ర‌కు మాధ‌వ్ కోర్టుకు వెళ్లి టీడీపీ మీద గెలిచారు. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌ల‌తో హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండూ వైసీపీ ఖాతాలో ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు అంటున్నారు.

ఇక్క‌డితో ఆగ‌లేదు బాల‌య్య‌. ఈరోజు సోష‌ల్ మీడియా కొన్నాళ్లుగా వైర‌ల్ అవుతున్న ఒక మెసేజ్‌ ను బాల‌య్య చెప్పాడు. ఫ్యాను ఇంట్లో దూలానికి ఉండాలి, గ్లాసు బారులో ఉండాలి, సైకిల్ అసెంబ్లీకి వెళ్లాలి అన్న‌ది ఆ మెసేజ్‌. దీనిని చెప్ప‌డం వ‌ల్ల అస‌లే బాల‌య్య‌పై ఫైర్ అవుతున్న ప‌వ‌న్‌, నాగ‌బాబు తీవ్రంగా స్పందించే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ టీడీపీ ని ఏమ‌న‌డం లేదు. కానీ బాల‌య్య వారిద్ద‌రినీ కెలికి టీడీపీకి, బాబుకి బీభ‌త్సమైన డ్యామేజ్ చేసే ప‌నేదో పెట్టుకున్న‌ట్టుంది చూస్తుంటే... బాల‌య్యా మ‌జాకా?


Tags:    

Similar News