కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. ఇక ఈ కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తుంది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్లే అనుమానితుల సంఖ్య రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. దీనితో ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు.. స్కూళ్లు - జన సమూహాలు ఉండే ప్రాంతాల ప్రదేశాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల సంఖ్య పెంచారు. ఇటు ఏపీలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు.
ఇదే అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై జనసేన పార్టీ నేత - మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరంగా స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం.. focus on it. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి.. 151 మంది mla లని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం.. థాంక్స్ సీఎం గారు అంటూ ట్వీట్ చేశారు.
ఒక పక్క ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ విషయం లో హై అలెర్ట్ ప్రకటించింది అంటే అర్థం విషయం చాలా తీవ్రంగా ఉందనే కదా. చాలా తీవ్రంగా ఉంటేనే అలా ప్రకటిస్తారు అన్న నాగబాబు తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాల్లోనే కరోనా స్ప్రెడ్ కాకుండా పబ్లిక్ మూవ్ మెంట్స్ మీద పరిమితులు - ఆంక్షలు పెట్టారు. అలాంటప్పుడు ఎలక్షన్స్ అనేవి పబ్లిక్ తో ముడిపడిన విషయం కాబట్టి ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ మాత్రానికే కులాల ప్రస్తావన తెచ్చి మాట్లాడటం అంత మంచిది కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల వెబ్ సైట్స్ లో విమర్శిస్తుంటే ఆశ్చర్యపోయాం అని - మీరు వైసీపీని సమర్ధిస్తే తప్పు లేదు కానీ - వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అని, లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. ఎన్నికలు వాయిదా పడ్డాయని బాధపడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి అని విమర్శలు గుప్పించారు.