ఒక చిన్న తొందరపాటు ఒక నేత రాజకీయ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందనటానికి నిలువెత్తు నిదర్శనం మాజీ టీడీపీ నేత.. ప్రస్తుత బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత.. అగ్రనేతలుగా పరిగణించే వారిలో నాగం ఒకరు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత తిరుగులేని నేతగా ఆవిర్భవించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు చేయటానికి తెలుగు తమ్ముళ్లకు దమ్ములు చాలేవి కావు.
అలాంటి పరిస్థితుల్లో పార్టీ తరఫున వైఎస్‌ను విపరీతంగా విమర్శించటమే కాదు.. వైఎస్ మీద ఒక రేంజ్‌లో పోరాడిన వ్యక్తిగా నాగం గుర్తిండిపోతారు. అప్పట్లో వైఎస్ మీద విమర్శలు ఆయన నోటి నుంచి వినాలని తెగ ఆరాటపడేవారు. అంతటి ఛరిష్మా ఉన్న నేత తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమ నినాదం విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోవటం లేదన్న ఉద్దేశ్యంతో పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
నిజానికి నాగం పార్టీని వదిలిపెట్టి వెళ్లటానికి మరో ముఖ్యమైన కారణం.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవం కూడా. తెలంగాణ వాదులు ఆయనపై దాడి చేసిన తర్వాత.. తెలంగాణ ఉద్యమం విషయంలో ఆయన చాలా సీరియస్‌గా ఆలోచించటం మొదలుపెట్టారు. ఆ దిశగా ఆయన అగుడులు వేశారు. ఆ సమయలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ.. కేసీఆర్‌తో నాగంకు ఉన్న ఇగో సమస్యల కారణంగా కారు ఎక్కేందుకు ఆయన ఇష్టపడలేదని చెబుతారు.
తదనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన.. ఆ పార్టీలో తన మార్క్ చూపించేందుకు ఎంత ట్రై చేసినా.. ఆయన్ను జిల్లాకే పరిమితం చేయటంతో నాగం పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోవటంతో ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకప్పుడు వైఎస్ లాంటి బలమైన నేతను సింగిల్ మనిషిగా ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు ఆయన మాట ఆయనకు.. ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి.
దీంతో.. ఆయన ఆత్మవిమర్శలో పడ్డారని చెబుతున్నారు. ఎంతకాలం ఇలా ఉండటం అన్న ప్రశ్నకు ఆయనకు ఆయన.. ఆయన్ను నమ్ముకున్న అనుచరగణానికి భరోసా ఇవ్వలేకపోవటంతో ఆయన ఇప్పుడు మళ్లీ సైకిల్ ఎక్కే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన తన సొంత నియోజకవర్గమైన నాగర్‌కర్నూలు నియోజకవర్గ అభిమానులతో సమావేశం నిర్వహించినట్లు చెబుతున్నారు.
ఈ సమావేశానికి హాజరైన పలువురు.. నాగంను సైకిల్ ఎక్కాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. మరి.. నాగం సైకిల్ ఎక్కుతారా? లేదా? అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో నాగంను పార్టీలో చేర్చుకుంటే.. మిత్రపక్షంతో సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో నాగంను పార్టీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఏం రాయబారం చేస్తారో చూడాలి