రాజకీయాల్లో శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే సహచరులు ఉంటారు. ఇపుడు కాలం మారుతోంది కాబట్టి ప్రత్యర్ధులు అనుకోవడం సబబు. అయితే ఢీ అంటే ఢీ కొడుతున్న రాజకీయాలలో చూసుకుంటే ప్రత్యర్ధులు కాస్తా బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. ముఖాముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడడంలేదు. దానికి ఏపీలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు అచ్చమైన ఉదాహరణ. ఈ ఇద్దరూ అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడా ఏ వేడుకల్లో కలసిన సందర్భాలు ఎవరూ చూసి ఎరగరు.
సరే వారు అధినాయకులు, వారి సిద్ధాంతాలు అలా ఉన్నాయనుకున్నా వైసీపీ, టీడీపీ నేతల మధ్యన కూడా ఆ రచ్చ అలా సాగుతూనే ఉంది. ఆఖరికి పరిస్థితి ఎంతలా తయారైంది అంటే ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్న దృఢ నిశ్చయానికి నేతాశ్రీలు వచ్చేశారు. ఇలాంటి సమయంలో ఉప్పూ నిప్పులూ ఉన్న వైసీపీ నేతల ఇంట్లో టీడీపీ కీలక నేత ఎవరన్నా కనిపిస్తే అంతకంటే వింతా విడ్డూరం మరోటి ఉండదు.
అలాంటి సీనే ఇపుడు ఒకటి జరిగింది. వైసీపీకి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా రిసెప్షన్ తాజాగా విజయనగరంలో జరిగింది. దానికి విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, యువ నాయకుడు అయిన కిమిడి నాగార్జున హాజరుకావడం అందరికీ ఆకట్టుకుంది. బొత్స సైతం యువ టీడీపీ నేతలను ఆప్యాయంగా పలకరించి ముచ్చట్లు పెట్టారు.
ఇక బొత్స సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ అయితే నాగార్జునతో కలివిడిగా మాట్లాడారు. బొత్స తనయుడు సందీప్ అయితే టీడీపీ యువనేతతో నవ్వుతూ తుళ్ళుతూ గడిపారు. మొత్తానికి దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు ప్రధాన పార్టీల నేతలు కూడా వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇంతకీ నాగార్జున రాక ఎందుకు ప్రాముఖ్యత అంటే ఆయన 2019 ఎన్నికల్లో బొత్సకు ఎదురుగా టీడీపీ తరఫున చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అదే సీటు నుంచి బొత్స ఫ్యామిలీతో తలపడతారు. తెల్లారిలేస్తే వైసీపీ మీద టీడీపీ విమర్శలు చేస్తుంది. అలాగే వైసీపీ నేతలు కూడా టీడీపీ మీద ఘాటు కామెంట్స్ చేస్తారు. ఇలా వాతావరణం ఎంత వేడిగా ఉన్నా కూడా నాగార్జున వాటిని కేవలం రాజకీయాలకే పరిమితం చేస్తూ బొత్స ఇంటికి రావడాన్ని మాత్రం అంతా మెచ్చుకుంటున్నారు.
ఈ యువ టీడీపీ లీడర్ విదేశాల్లో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత కిమిడి మృణాళిని కుమారుడు. ఇక ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఈయనకు స్వయానా పెద నాన్న అవుతారు. అలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కూడా మర్యాదగా పద్ధతిగా రాజకీయాలు చేయడంతో నాగార్జునకు మంచి ఫ్యూచర్ ఉందని పార్టీలకు అతీతంగా అంతా అంటారు. ఇక రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉన్నా ఆ గీత దాటి వస్తేనే ఏ నాయకుడికి అయినా అందం, అర్ధం. అదే జనాలకు ఇచ్చే అసలైన సందేశం.