ర‌జినీ రాజ‌కీయ భ‌వితవ్యం చెప్పేసిన న‌టీ

Update: 2017-05-08 11:53 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై మ‌రోమారు చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌ముఖ న‌టీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నగ్మా తాజాగా ర‌జినీకాంత్‌ను ఆయన స్వగృహంలో భేటీ అవ‌డంతో తాజాగా త‌లైవా పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ సాగుతోంది. రజినీతో ఆయ‌న నివాసంలో స‌మావేశం అనంత‌రం నగ్మా మీడియాతో మాట్లాడుతూ ``నేను రాజ‌కీయప‌ర‌మైన కార‌ణాల‌తో ర‌జినీకాంత్‌ను కలవలేదు. రాజకీయాలు తప్ప అనేక విషయాలపై ఇద్దరం చర్చించుకున్నాం.  కేవలం మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి`` అంటూ తెలిపింది. కానీ రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తే మాత్రం మంచి విజయం సాధిస్తారు అంటూ నగ్మా తన ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

కాగా, నగ్మా-రజినీకాంత్ లు భాషా సినిమాలో కలిసి నటించి అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి కలయిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న న‌గ్మా త‌మిళ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ర‌జినీతో భేటీ చ‌ర్చనీయాంశం అయింది.  రజినీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా, నగ్మా వెండితెరకు దూరమై చాలా కాలంగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు.
Tags:    

Similar News