తాను రాజకీయాలలోకి వస్తున్నాననే హింట్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయని ప్రముఖ నటుడు కమల్ హసన్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చినట్లయింది. ఇటీవలే కమల్ హాసన్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నప్పటికీ తన రంగు కాషాయం కాదని అన్నారు. తద్వారా బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అలా ఒక ఆప్షన్ పూర్తయిన సమయంలో తాజాగా జరిగిన భేటీ మరో కొత్త చర్చను తెరమీదకు తెచ్చింది. వెటరన్ యాక్ట్రెస్ - ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నగ్మా నిన్న సాయంత్రం కమల్ హాసన్ ని ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్ గా మారింది.
కమల్ హసన్ ను కలిసిన అనంతరం నగ్మా ట్వీట్ చేసింది. అయితే ఎందుకు, ఏమిటి అనే విషయం ఇందులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది సాదాసీదా సమావేశం అని కొందరు అనుకుంటున్నప్పటికి మరికొందరు మాత్రం ఈ భేటీ వెనుక రాజకీయ ఎత్తుగడ ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. కమల్ హాసన్ రాజకీయాలలోకి వస్తున్నాననే హింట్ ఇవ్వడంతోనే నగ్మా ఆయనని కలిసి ఉంటుందని తమిళ తంబీలు భావిస్తున్నారు. బీజేపీలో చేరడం లేదనే విషయాన్ని కమల్ స్పష్టం చేసినందున కాంగ్రెస్ నాయకురాలిగా తనకున్న సినీ పరిచయడంతో కమల్ ను పార్టీలో చేర్పించేందుకు నగ్మా ప్రయత్నిస్తుండవచ్చని అంటున్నారు.
మరోవైపు బాలచందర్ శిష్యులు - ప్రస్తుత తమిళ రాజకీయాలలో కీలక వ్యక్తులుగా ఉన్న రజనీకాంత్ - కమల్ హాసన్ లని వరుసగా భేటి కావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. మే నెలలో రజనీకాంత్ ని కలిసిన నగ్మా ఆయనని ఫ్లెండ్లీగానే కలిసానే తప్ప మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అప్పట్లో చెప్పింది. ఒకవేళ రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తే మంచి విజయం సాధిస్తారని మాత్రం స్పష్టం చేసింది. ఇప్పుడు అదే రీతిలో కమల్ హాసన్ ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.