తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేని హీరోయిన్లలో నగ్మా ఒకరు. సినిమాల్లో కెరీర్ ముగిశాక ఆమె రాజకీయాల వైపు అడుగులేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద మహిళా నేతల్లో నగ్మా కూడా ఒకరు. తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దే బాధ్యతలు అధినాయకత్వం నగ్మాకే అప్పగించడం విశేషం. దీంతో పాటుగా పుదుచ్చేరి బాధ్యతలు కూడా ఆమెకే దఖలు పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తోంది. తాజాగా ఆమె పుదుచ్చేరిలోనూ పర్యటించింది. ఈ సందర్భంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిరణ్ బేడీపై నగ్మా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ఐపీఎస్ అధికారిగా గొప్ప ఇమేజ్ సంపాదించిన కిరణ్ బేడీని నగ్మా తీవ్రంగా విమర్శించింది. ఆమెను బీజేపీ ఏజెంట్ గా అభివర్ణించింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా.. వాటిని అడ్డుకునేందుకు కిరణ్ బేడీ ప్రయత్నిస్తోందని నగ్మా విమర్శించింది. ప్రభుత్వానికి కిరణ్ బేడీ ఏమాత్రం సహకరించడం లేదని నగ్మా ఆరోపించింది. పేదల కోసం పెట్టిన సంక్షేమ పథకాల్ని అమలు చేసే విషయంలో కిరణ్ బేడీ అడుగడుగునా అడ్డం పడుతోందని నగ్మా విమర్శించింది. లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని.. ఆమె కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ చెప్పినట్లు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ప్రవర్తిస్తోందని నగ్మా ఆరోపించింది. కిరణ్ బేడీ తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె వార్నింగ్ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/