నాగ్ పూర్ మేయర్‌ జోషి పై కాల్పుల కలకలం!

Update: 2019-12-18 10:24 GMT
మహారాష్ట్రలోని నాగ్ పూర్ మేయర్‌ సందీష్ జోషి పై గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది  కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే , ఈ కాల్పుల్లో మేయర్ సందీష్ జోషి తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరుడు ఆదిత్య ఠాకూర్ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వార్ధా రోడ్డు వద్ద ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పూర్తి వివరాలు చూస్తే .. సందీష్ జోషి - 24వ పెళ్లి రోజు సందర్భంగా కొంతమంది స్నేహితులతో కలిసి నాగ్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న ఓ దాభాలో పార్టీ ఇచ్చారు. ఆ తరువాత  సందీష్ జోషి..స్వయంగా తన కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరారు. వార్థా రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకోగానే, బైక్‌ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డగించి - గన్ తో కాల్పులు జరిపారు. ఆ తరువాత అక్కడినుండి  పరారయ్యారు. ఓ బుల్లెట్ మేయర్ కూర్చొన్న డ్రైవింగ్ సీటు అద్దాలకు - మరో బుల్లెట్ వెనుక సీటు విండోకు, ఇంకో బుల్లెట్ వాహనం వెనుక వైపు తగిలింది. ఈ ఘటన జరిగిన వెంటనే జోషి ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ... ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకొని ఆయన్ని సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఆక్రమణలు తొలగించడంపై జోషిని బెదిరిస్తూ..NMC కంప్లైట్ బాక్స్‌లో రెండు లేఖలు వచ్చినట్టు తెలుస్తుంది.
Tags:    

Similar News