ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులు ఇప్పుడు ఆ శాఖ అధిపతిపై మండిపడుతున్నారు. ఆయనొక్కరే విజయవాడలో ఆఫీసు తెరిచి కూర్చుంటే తామంతా హైదరాబాద్ నుంచి తిరగాల్సి వస్తోందంటూ ఆగ్రహిస్తున్నారు. ఒక్క అధికారి కోసం ఇంతమంది తరలి వెళ్లడం భావ్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయనే హైదరాబాద్ వస్తే సరిపోతుంది కదా! అంటున్నారు.
సాధారణ పరిపాలక శాఖలోని పొలిటికల్ విభాగానికి కొత్త కార్యదర్శిగా నియమితులైన నాగులపల్లి శ్రీకాంత్ మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. అది కూడా విజయవాడలోనే బాధ్యతలు స్వీకరించడం విశేషం. వాస్తవానికి ఏ అధికారైనా - ఏ ఉద్యోగైనా సచివాలయంలోనే బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. శ్రీకాంత్ మాత్రం విజయవాడలో బాధ్యతలు స్వీకరించడం, ఇప్పటివరకు సచివాలయానికి రాకపోవడం గమనార్హం. ఆయన సాధారణ పరిపాలన శాఖను వెనువెంటనే విజయవాడకు తరలించేందుకు ప్రయత్నించడం కూడా ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది. ఉద్యోగులు - అధికారులను తొలిసారి కలిసేందుకు - వారి విధులను తెలుసుకునేందుకు సెక్షన్ అధికారి - ఆపై స్థాయి వారంతా బుధవారం విజయవాడకు తరలిరావాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వారంతా బుధవారం తెల్లవారుజామున విజయవాడకు వెళ్లేందుకు సమాయత్తమనట్లు తెలిసింది. తరలింపుపై కూడా శ్రీకాంత్ ఉద్యోగులతో చర్చించే అవకాశాలున్నాయి.
సచివాలయ శాఖలన్నీ తప్పనిసరిగా సచివాలయంలోనే ఉండాలి. అందులోనూ ప్రభుత్వ పాలనకు గుండె వంటి సాధారణ పరిపాలన శాఖ తప్పనిసరిగా ఇతరశాఖలకు అందుబాటులో ఉండాలి. ఈ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ హైదరాబాద్ రాకూడదని, విజయవాడలోనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే క్రిడా కార్యాలయంలోనే ఒక భాగాన్ని సాధారణ పరిపాలన శాఖ విధులకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. మిగిలిన శాఖలన్నీ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా, సాధారణ పరిపాలన శాఖ మాత్రం క్రిడా ప్రాంగణంలో పనిచేయాలని భావిస్తుండడంపై ఇతర శాఖల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ అందుబాటులో లేకపోతే, ఆ ప్రభావం ఇతర శాఖలపై కూడా పడుతుందని వారంటున్నారు.