ఇప్పటికి చాలానే ఎన్నికలు చూసి ఉంటారు. కానీ.. ఏ ఎలక్షన్లోనూ.. ఏ నాయకుడి కోసం ఏ అభిమాని చేయని సరికొత్త త్యాగానికి సిద్ధమైపోయాడు సిద్దిపేటకు చెందిన కుర్రాడు కోత్వల్ శ్రీనివాస్. ఇప్పుడు ఇతగాడి చేస్తున్న పని హరీశ్ రావు మనసును కూడా దోచేసినట్లుగా చెబుతున్నారు.
సిద్దిపేటలో ఇతగాడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సిందే. అంత ఘనంగా ఏం చేశాడంటారా? చేసింది సింఫుల్ పనే అయినా.. దాని ఎఫెక్ట్ మాత్రం పత్రికల్లో భారీ ప్రచారంగా మారింది.దీంతో.. ఇతగాడి గురించి చర్చ పెట్టుకోవటం అందరి పనైంది. ఇంతకీ కోత్వాల్ శ్రీనివాస్ ఏం చేశాడంటే.. తన అభిమాన నాయకుడు హరీశ్ రావుకు వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ రావటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇందుకుగాను తన వంతు బాధ్యతగా.. తాను చేసే వృత్తి క్షవరం పనిని ఫ్రీగా చేసే పని పెట్టాడు. ఇందుకు పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి.. హరీశ్ అన్నకు ఓటేయండి.. కారుగుర్తుకే మన ఓటు అని ప్రచారం చేస్తూనే.. హరీశ్ కు ఓటు వేస్తానని చెప్పిన వారికి ఉచితంగా క్షవరం.. ఉచితంగా షేవింగ్ చేస్తున్నాడు.
ప్రతి రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉచిత కార్యక్రమాన్ని చేపట్టాడు. సిద్దిపేటలోని హనుమాన్ నగర్ లోని నడకదారి దగ్గర ఇతనీ ఉచిత కార్యక్రమం చేపట్టాడు. హరీశ్ మీద ఉన్న అభిమానంతోనే తానీ పని చేస్తున్నానని.. నాయి బ్రాహ్మణులకు హరీశ్ ఎంతో మేలు చేశారని.. ఉడతా భక్తిగా తానీ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పాడు. ఇప్పటివరకూ ఎవరూ చేయని విధంగా.. కొత్త తరహాలో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. చూస్తుంటే.. కోత్వాల్ శ్రీనివాస్ కు మాంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నట్లు కనిపించట్లేదు?