వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోమ సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పాత్ర గురించి ఇప్పటికే వివిధ రకలైన విశ్లేషణలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాలుగేళ్లుగా విజయవాడలో ఒక బ్రిడ్జి కట్టలేని చంద్రబాబు తెలంగాణలో తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో దోచిన డబ్బంతా ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు 1200 కోట్ల ఫండింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందన్న ఆయన.. రేవంత్‌రెడ్డిని ముందు గా కాంగ్రెస్‌లోకి పంపించడానికి పెద్ద ప్లాన్ జరిగిందన్నారు. 2013లో అవినీతిపరులు కాంగ్రెస్‌లో చేరుతారని అన్నారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కాంగ్రెస్‌లోనే చేరిపోయారన్నారు.
కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన చంద్రబాబు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ - రాజస్థాన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు భారీగా ఫండింగ్ చేశాడని ఆరోపించారు. ఏపీలో 4 లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఫండింగ్ చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. 15 వేల కోట్లు కేవలం ఏపీ ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం సిద్ధంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. దోపిడీ సొమ్ము ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లబోతుందో కూడా తనకు తెలుసని.. యరపతినేని సుబ్బారావు - శ్రీనివాసరావు - గోపి ద్వారా ఎన్నికలకు డబ్బు వెళ్లబోతున్నట్టు ఆయన ఆరోపించారు. తన దగ్గర చంద్రబాబు అవినీతికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందని.. మీడియాకు త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
నీతిమంతుడిని, సీనియర్ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ అందులో ఇసుమంతైనా నిజం లేదన్నారు. ‘తెలంగాణ ఎన్నిలక ప్రక్రియను చూస్తే రాష్ట్రాన్ని బాబు ఎలా దోచుకున్నారో అర్థం అవుతోంది. ఏ రోజు ఎంత డబ్బు తరలిస్తారు, ఎక్కడ దాస్తున్నారో వివరిస్తా. ప్రజలారా .. అదంతా మీ సొమ్ము, మీరెలా తీసుకుంటారో మీ ఇష్టం. అవినీతితో చంద్రబాబు హిమాలయ అంచులకు వెళ్లారు`` కానీ నీతులు చెప్తున్నారు. అని మండిపడ్డారు.