అమెరికాలో నల్గొండ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను కాల్చిచంపిన దుండగులు

Update: 2022-06-22 08:21 GMT
అమెరికాలో మరోసారి తుపాకీ తూటా కల్లోలం సృష్టించింది. ఈసారి తెలంగాణ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసింది. నల్గొండ జిల్లాకు చెందిన సాయికిరణ్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమెరికాలోని మేరిల్యాండ్ నగరంలో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.

అమెరికాలోని మేరీల్యాండ్‌లో నల్గొండకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ (26) కాల్చి చంపబడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ దురదృష్టకర సంఘటన జరగ్గా  మృతుడి తలపై తుపాకీ గాయం కనిపించడంతో ఈ హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో చరణ్ తన కారులో ప్రయాణిస్తుండగా నల్లజాతీయుడు కాల్చి చంపాడు. గాయపడ్డ సాయిచరణ్ ను యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్  ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ, కొద్దిసేపటి తర్వాత చనిపోయాడు.

 చరణ్‌ తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపేసి కారులో తన స్థలానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నివేదికలు ఇంకా వెల్లడించనప్పటికీ, కుటుంబ సభ్యుల ప్రకారం..  సాయిచరణ్ తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నాలుగేళ్ల క్రితం సాయిచరణ్ అమెరికాకు వెళ్లగా ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం మేరిల్యాండ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.అతడి సోదరి కూడా అమెరికాలో విద్యనబ్యసిస్తున్నాడు.

సాయిచరణ్ కారులో కాటన్స్‌విల్లే సమీపంలో వెళుతుండగా నల్లజాతీయుడు కాల్చి చంపాడు. తలపై తుపాకీ గాయంతో సాయిచరణ్ మృతదేహం కనిపించింది.

ప్రస్తుతం మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News