ప్రగతి నివేదన సభను బాయ్‌ కాట్ చేసిన గ్రామం

Update: 2018-09-01 13:56 GMT
తెలంగాణ అంతటా ప్రగతి నివేదన సభ హడావిడి కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రగతి నివేదన సభ కోసం జనసమీకరణ సందడి కనిపిస్తోంది. ట్రాక్టర్లు - బస్సులు - కార్లు ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్నాయి. ఎటు చూసినా గులాబీ రెపరెపలు. కానీ.. నల్గొండ జిల్లాలోని ఒక ఊరిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టిఆర్ ఎస్ హడావిడి పెద్దగా లేకపోగా శుక్రవారం గ్రామంలో బంద్ జరిపారు. రోడ్డు మీదకొచ్చి జనాలు నిరసన తెలిపారు. శనివారం కూడా దాదాపు అదే పరిస్థితి కనిపించింది.
   
తమకు తెలంగాణ ప్రభుత్వం ఆశచూపి మోసం చేసిందన్నది ఆ ఊరి ప్రజల ఆరోపణ. జిల్లాల విభజన సందర్భంగా నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. పోలీసు స్టేషన్ - ఎమ్మార్వో ఆఫీసు - ఎండిడిఓ ఆఫీసు ఏర్పాటు చేశారు. తీరా తెల్లారితే మండలం ఆవిర్భవించేవేళ మండలాన్ని క్యాన్సల్ చేశారు. అదీ వారి కోపం.
   
ఈ ఆందోళన ఈ ఒక్క రోజుదే కాదు. మండల కేంద్రంగా మార్చి మళ్లీ రద్దు చేసిన నాటి నుంచీ వారు మండిపడుతూనే ఉన్నారు. సుమారు 690 రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామం నుంచి ప్రగతి నివేదన సభకు ఒక్కరంటే ఒక్కరం కూడా వెళ్లబోమని వారు చెబుతున్నారు. గ్రామంలో ఎవరు కూడా టిఆర్ ఎస్ ప్రగతి సభకు పోవద్దని తీర్మానం చేశారు. మండలాన్ని ఇచ్చే వరకు ఆందోళన కంటిన్యూ చేస్తామని వారు అంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె నుంచి, గల్లీ నుంచి జనం ప్రగతి నివేదన సభకు వెళ్తుంటే వీరు మాత్రం బాయ్ కాట్ చేస్తున్నారు.
Tags:    

Similar News