రాజకీయాల్లో భాగంగా మీడియా సంస్థలు కూడా కొన్ని పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదా కొన్ని పార్టీల పట్ల పక్షపాతం వహించే పత్రికలుగా పలు న్యూస్‌పేపర్లకు ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్, ఆయన భార్య వైఎస్ భారతి నేతృత్వంలో సాగుతున్న సాక్షి పత్రిక ఆపార్టీకి అనుకూలంగా ఉంటుందని రాజకీయవర్గాలు డిసైడ్ అయిపోయాన్నాయి. మరోవైపు కొందరు వైసీపీ నాయకులు ఆంధ్రజ్యోతి అంటే తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటారు. తాజాగా వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆంధ్రజ్యోతిని ఆకాశానికి ఎత్తేశారు.
నెల్లూరు జిల్లా వైసీపీ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సాక్షిపత్రికపై ధ్వజమెత్తారు. అక్రమాలను వెలుగులోకి తేవడంలో నెల్లూరులో సాక్షి పత్రిక విఫలమయిందని మండిపడ్డారు. సాక్షి నెల్లూరు జిల్లాలోని రిపోర్టర్లు టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు సైతం సాక్షిలో తగిన ప్రాధాన్యమివ్వడంలేదని నల్లపురెడ్డి వ్యాఖ్యానించారు.
అదేక్రమంలో ఆంద్రజ్యోతి పత్రికను నల్లపురెడ్డి కీర్తించారు. అక్రమాలను వెలికితీయడంలో ఆంధ్రజ్యోతి ముందుందని నల్లపురెడ్డి అన్నారు. ఇకనైనా సాక్షి పత్రిక జిల్లాలోని సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు.
ఇటీవలు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నల్లపురెడ్డి...అధినేత జగన్ జోక్యంతో దాన్ని వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడ్డారు. తాజాగా ఆయన ఆ పత్రికను కీర్తించడంంటే..మతలబు ఏంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.