రాజీనామా చేసిన జీవితాంతం జగన్ వెంటేనంట

Update: 2015-08-17 05:01 GMT
రాజకీయాల్లో నేతల మాటలు చాలా చిత్రంగా ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కొన్ని సందర్బాల్లో మాటలకు చేతలకు మధ్య ఏ మాత్రం సంబంధం లేనివి చోటు చేసుకుంటాయి. ఈ సందర్భంగా వారు చెప్పే మాటలు చాలానే సందేహాలు కల్పిస్తుంటాయి. తాజాగా నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించిన ఒక ఉదంతం ఇలాంటి పరిస్థితినే కల్పిస్తోంది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి జగన్ పార్టీలోకి చేరిపోయి.. జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తాజాగా తన పార్టీ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా  ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వ్యక్తిగత కారణాలతో తాను తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ప్రసన్నకుమార్ రెడ్డి.. జీవితాంతం తాను జగన్ వెన్నంటే ఉంటానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే చూడాలన్నదే తన లక్ష్యమని.. అందుకోసం తాను ఎంతైనా కష్టపడతానని చెప్పుకొచ్చారు. మరిన్ని మాటలు చెప్పే ప్రసన్నకుమార్ రెడ్డి.. పార్టీ పదవికి ఎందుకు రాజీనామా చేసినట్లు..? పవర్ లో లేని పార్టీలో సహజంగానే కొంత నిరాశ.. నిస్పృహలు ఉంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కొని.. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా పార్టీ పదవికి రాజీనామా చేయటం ఏమిటో..? ఏది ఏమైనా పార్టీ పదవికి రాజీనామా చేసినా.. జగన్ కు మాత్రం వెన్నంటే ఉన్ననని చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. మిగిలిన వారిని కూడా తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారని చెప్పాలి.
Tags:    

Similar News