సమైక్యాంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతకు రాలేకపోతున్నప్పటికీ ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం తన జర్నీపై క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి త్వరలో తమ గూటికి చేరనున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను విడదీసిన తీరును నిరసిస్తూ సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన సమైక్యాంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర పార్టీ తరఫున సొంత తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని గత ఎన్నికల్లో బరిలో నిలిపిప్పటికీ ఆయన ఓడిపోయారు. అనంతరం స్తబ్దుగా ఉన్న కిశోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు సమాచారం. పార్టీ మారే విషయమై ఇప్పటికే కిశోర్ కుమార్ రెడ్డి తన సన్నిహితులతో చర్చలు జరిపినట్లు సమాచారం. కిశోర్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఆసక్తి చూపించిన నేపథ్యంలో పార్టీ యువనేత - మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కిశోర్ కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చే బాధ్యతలను మంత్రి అమరనాథరెడ్డికి నారా లోకేష్ అప్పగించినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రాజకీయ భవిష్యత్‌పై కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందే ఆయన సోదరుడు కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.
మరోవైపు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయని రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ సభ్యత్వం తిరిగి అందుకోవడం ఉంటుందని అంటున్నారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చే తేదీలను బట్టి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తేదీ - వేదిక నిర్ణయం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాహుల్ సభను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.