గ‌జ‌ల్ ను పోలీసు క‌స్ట‌డీకి నో అన్న కోర్టు!

Update: 2018-01-05 04:41 GMT
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్ర‌ముఖ గాయ‌కుడు.. సాహితీవేత్త గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌ కు చిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ఆయ‌న చేసుకున్న బెయిల్ ద‌ర‌ఖాస్తుకు కోర్టు నో చెప్పేసింది. అదే స‌మ‌యంలో గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ను త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాలంటూ పోలీసులు చేసిన విన్న‌పానికి నో చెప్పేసింది.

త‌నను లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లుగా  ప్రైవేటు వెబ్ రేడియో ఛాన‌ల్ రేడియో జాకీ కంప్లైంట్ ఇవ్వ‌టం.. పోలీసులు వెంట‌నే స్పందించి విచారించ‌టం.. ఆధారాలు సేక‌రించ‌టంతో అరెస్ట్ త‌ప్ప‌లేదు. బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన‌ట్లు చెబుతున్న కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండ‌గా.. ఈ కేసుకు సంబంధించి విచార‌ణ జ‌రిపేందుకు చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌ ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ పోలీసులు పెట్టుకున్న క‌స్ట‌డీ పిటిష‌న్‌ కు  కోర్టు నో చెప్పింది. వీడియోల‌తో అన్ని ఆధారాలు ఉన్న వేళ‌.. మ‌ళ్లీ పోలీసుల క‌స్ట‌డీ అవ‌స‌రం ఏమిటంటూ కోర్టు పోలీసుల‌ను ప్ర‌శ్నించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. పోలీసులు కోరుకున్నట్లు క‌స్ట‌డీకి నో చెప్పేసిన కోర్టు.. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ కోరుకున్న‌ట్లు బెయిల్ ను ఇవ్వ‌క‌పోవ‌టం గమ‌నార్హం.

Tags:    

Similar News