నాంప‌ల్లి కోర్టులో కొండాకు ఎదురుదెబ్బ‌!

Update: 2019-04-25 06:50 GMT
టైం బాగోక‌పోతే ఇలానే ఉంటుందేమో?  మొన్న‌టి వ‌ర‌కూ గులాబీ ఎంపీగా ద‌ర్జాగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌కు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి క‌ష్టాలు షురూ అయ్యాయి. ఒక దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా మీడ ప‌డుతున్న స‌మ‌స్య‌ల నుంచి ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌టం లేదు. తాజాగా అలాంటిదే మ‌రో ఎదురుదెబ్బ ఎదురైంది. వ‌రుస దెబ్బ‌ల‌తో చోటు చేసుకున్న ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చేవెళ్ల ఎంపీ  అభ్య‌ర్థి.. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో కొండాకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ ఐ.. కానిస్టేబుల్ ను ఆయ‌న నిర్బందించిన‌ట్లుగా ఆరోప‌న‌లు వ‌చ్చాయి.

దీనికి సంబంధించిన కేసు ఒక‌టి న‌మోదైంది. విచార‌ణ చేప‌ట్టిన పోలీసు అధికారులు.. కొండా ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆచూకీ ల‌భించ‌లేదు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు కొండా.

వారం రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు కొండా ఆచూకీ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా ల‌భించ‌లేదు. ఇలాంటివేళ‌.. ఈ కేసుకు సంబంధించిన త‌న‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ కొండా నాంప‌ల్లి కోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. పోలీసుల ఎదుట విచార‌ణ‌కు రాకుండా కోర్టులో బెయిల్ కోరిన నేప‌థ్యంలో కోర్టు ఆయ‌నకు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీక‌రించ‌లేదు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కొండా త‌ప్ప‌నిస‌రిగా పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. మ‌రి.. దీనికి కొండ రెస్పాన్స్ ఏమిటో చూడాలి?  విచార‌ణ‌కు ఆయ‌న వ‌స్తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News