నాని, వంశీ.. ఇంక్కడెవరూ గాజులు తొడుక్కోలా?

Update: 2019-11-20 05:00 GMT
నందమూరి పౌరుషం బయటకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ఘాటు కామెంట్లపై నందమూరి హీరో కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత దూషణలకు దిగిన వారిద్దరిపై ఫైర్ అయ్యారు. ఏకంగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

మా మావయ్య, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలను చూసి చాలా బాధేసిందని నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ అన్నారు. మా మావయ్య చంద్రబాబు సీట్లు ఇస్తేనే ఈరోజు కొడాలి నాని, వంశీ ఈ స్థాయికి వచ్చారని విమర్శించారు. 2004 - 2009 లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారన్నారు. వాళ్లిద్దరూ ఇప్పుడు బతుకునిచ్చిన చంద్రబాబుపై మాట్లాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చైతన్యకృష్ణ ధ్వజమెత్తారు.

ఇక చైతన్యకృష్ణ తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో కొడాలి నాని, వంశీకి హెచ్చరికలు పంపారు. ఇంకోసారి బూతులు మాట్లాడితే మంచిగుండదు అంటూ చైతన్యకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. నోరుందని చెప్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇక్కడెవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదంటూ చైతన్యకృష్ణ తీవ్ర పదజాలం వాడారు. విధానాలపై విమర్శలు చేస్తే ఫర్వాలేదని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదని టేక్ కేర్ అంటూ వీడియోలో హెచ్చరికలు పంపారు. నందమూరి హీరో పంపిన ఈ హెచ్చరిక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.


Full View

Tags:    

Similar News