ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో సంక్రాంతి వాతావరణం మొదలైపోయింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకోనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు వెళ్తారు. చంద్రబాబు కుటుంబంతో పాటు, నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయమే నారా, నందమూరి కుటుంబ సభ్యులు నారావారి పల్లెకు చేరుకోనున్నారు. ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం వరకు నారావారిపల్లెలోనే ఉంటారు. ఆ తర్వాత బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. కాగా నారావారి పల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో గ్రామస్థులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 17వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి కర్ణాటకలోని ఉడిపికి వెళ్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయం బయలుదేరి విజయవాడకు తిరిగివస్తారు.
మరోవైపు భోగీ రోజున చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా రిలీజ్ కానుండడం... ఆ సినిమాపై హై ఎక్సెపెక్టేషన్స్ ఉండడంతో ఆ కుటుంబం కూడా సందడిగా ఉంది. దీంతో చంద్రబాబు కోడలు, బాలకృష్ణ కుమార్తె అయిన బ్రహ్మణి, నారాలోకేశ్ లు కూడా సందడిగా ఉన్నారు.
సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కొంచెం ముందుగానే బుధవారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి మరీ ఆమెకు దర్శనాన్ని చేయించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు రాకుండా భువనేశ్వరి ఒక్కరే వెంకన్న దర్శనానికి రావడం విశేషం. మొత్తానికి చంద్రబాబు కుటుంబంలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయింది.