జీఎస్టీపై బ్రాహ్మ‌ణి కామెంట్‌ లో విష‌యం లేద‌ట‌

Update: 2017-07-01 17:48 GMT
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన జీఎస్టీపై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, హెరిటేజ్‌ సంస్థ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్ర‌శంస‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లోని కస్టమ్స్‌ కార్యాలయంలో శ‌నివారం జరిగిన జీఎస్టీ వేడుకల్లో అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి, జీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ సందీప్‌ ఎం.భట్నాగర్, హెరిటేజ్ డైరెక్ట‌ర్ బ్రాహ్మణి పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి జీఎస్టీని స్వాగ‌తించారు. జీఎస్టీతో వ్యాపారం చేయ‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని అన్నారు. అయితే ఆమె ప్ర‌సంగంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకూ 165 దేశాల్లో జీఎస్టీ అమలవుతోందని నారా బ్రాహ్మ‌ణి తెలిపారు. ఆ జాబితాలో భారత్‌ కూడా చేరిందని, ఇది శుభ‌ప‌రిణామ‌మ‌ని ఆమె చెప్పారు. కార్పొరేట్‌ కంపెనీలకే కాకుండా సాధారణ ప్రజానీకానికి కూడా జీఎస్టీ ఎంతో ఉపకరిస్తుందని బ్రాహ్మణి అన్నారు. ప‌దే ప‌దే ర‌క‌ర‌కాల ప‌న్నుల చిక్కుల‌ను ఎదుర్కునే అంశానికి ప‌రిష్కారం చూపుతుంద‌ని తెలిపారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు చేసే విధంగా తీసుకువ‌చ్చిన ఈ ఏకీకృత ప‌న్ను వ‌ల్ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని బ్రాహ్మ‌ణి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అపోలో ఆస్ప‌త్రుల ఎండీ సంగీతారెడ్డి మాట్లాడుతూ భార‌త‌దేశం ఎదిగేందుకు జీఎస్టీ దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ ఏకీకృత ప‌న్ను వ‌ల్ల ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్ స్థాయిని భార‌త్ పొందుతుంద‌ని చెప్పారు. జీఎస్టీతో ప‌లు అంశాల్లో త‌గ్గిన ధ‌ర‌ల‌ను తాము వెంట‌నే అమ‌ల్లో పెట్ట‌నున్న‌ట్లు సంగీతారెడ్డి తెలిపారు. కాగా, జీఎస్టీ అమ‌లుకు త‌గిన ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు జీఎస్టీ చీఫ్ క‌మిష‌న‌ర్ సందీప్ భ‌ట్నాగ‌ర్ తెలిపారు. వ్యాపారులు, సామాన్యుల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

అయితే నారా బ్రాహ్మ‌ణి ప్ర‌సంగంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. బ్రాహ్మ‌ణి చెప్పిన‌ట్లుగా 165 దేశాల్లో జీఎస్టీ అమ‌లు లేద‌ని చెప్తున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని నీతిఅయోగ్ సభ్యుడు వివేక్ దేవ్ రాయ్ వ్యాఖ్యాల‌ను ఉద‌హ‌రిస్తున్నారు. 165 దేశాల్లో జీఎస్టీ అమల్లో లేద‌ని వివేక్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లు తెలిపారు. కనీసం ఆరేడు దేశాలు కూడా జీఎస్టీని అమలు చేయడం లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. అంతేకాకుండా జీఎస్టీ వల్ల లాభాలు అబద్ధమేన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. అయితే ఇంత‌టి కీల‌క‌మైన విష‌యాన్ని నారా బ్రాహ్మ‌ణి ప‌క్క‌న‌పెట్టేశార‌ని చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News