బ్రాహ్మ‌ణిని రాహుల్ మీటింగ్‌ కు అందుకే పంపారా?

Update: 2018-08-15 06:01 GMT
కాలం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. మిత్రుల్ని శ‌త్రువులుగా.. ప్ర‌త్య‌ర్థుల్ని.. అత్యంత ఆప్త‌మిత్రులుగా మార్చే తీరు కాలం పుణ్య‌మే. విచిత్రం కాకుంటే.. ఏ పార్టీకి వ్య‌తిరేకంగా పెట్టారో.. ఇప్పుడు అదే పార్టీ తాను జ‌న్మ విరోధి అయిన పార్టీతో చెట్టాప‌ట్టాలు వేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టాన్ని చూస్తే.. రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాద‌న్న వైనం మ‌రోసారి నిరూపితం అవుతుంద‌ని చెప్పాలి.

ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఎవ‌రో ఒక‌రితో చెట్టాప‌ట్టాలు వేసుకోందే ఒక ప‌ట్టాన నిద్ర ప‌ట్ట‌ని చంద్ర‌బాబుకు ఇప్పుడు కాంగ్రెస్ అవ‌స‌రం వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ.. జ‌న‌సేన‌ను వాడేసిన బాబు..ఈసారి ఆ రెండు పార్టీల‌తో బంధం క‌ట్ అయిన నేప‌థ్యంలో.. కాంగ్రెస్ తో జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్నారు.

విభ‌జ‌న నిర్ణ‌యంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని పాతాళానికి ప‌డిపోయిన నేప‌థ్యంలో.. పార్టీ అంతో ఇంతో పుంజుకోవాల‌న్న ల‌క్ష్య‌మే బాబుతో కాంగ్రెస్ చేత‌లు క‌లిపేలా చేసింద‌ని చెప్పాలి. విప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌.. త‌న‌పై ఉన్న కేసుల విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ కు త‌న రుణాన్ని తీర్చుకునే ప్ర‌య‌త్నంలో భాగ‌మే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో బాబు జ‌త క‌ట్ట‌నున్నార‌ని చెబుత‌న్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అధికార ప్ర‌క‌ట‌న లేకున్నా..తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తున్న‌ప్పుడు కాంగ్రెస్ తో బంధుత్వం కోసం బాబు ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. లోగుట్టుగా కాంగ్రెస్ తో ర‌హ‌స్య సంభాష‌ణ‌ల్ని నెరిపిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇవేమీ క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

తాజాగా త‌న రెండు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక‌వేత్త‌ల భేటీకి బాబు కోడ‌లు క‌మ్ పారిశ్రామిక‌వేత్త బ్రాహ్మ‌ణి హాజ‌రుకావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.కాంగ్రెస్ తో తానుపెట్టుకోనున్న పొత్తుకు సంబంధించిన ఇండికేష‌న్ ను బ్రాహ్మ‌ణి రూపంలో బాబు ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీతో చెడిన త‌ర్వాత త‌న‌కు కాంగ్రెస్ అండ త‌ప్ప‌నిస‌రి అన్న విష‌యాన్ని గుర్తించి బాబు.. అందుకు త‌గ్గ‌ట్లే సీక్రెట్ భేటీలు జ‌రిపారు.

అయితే.. ఈ ర‌హ‌స్యాన్ని ఒక్క‌సారిగా రివీల్ చేస్తే.. ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ్ ప‌డ‌ట‌మే కాదు.. ఇంత‌కాలం కాంగ్రెస్ మీద ఉన్న శ‌త్రుత్వాన్ని ఎలా మ‌రిచిపోతారంటూ ప్ర‌శ్నించే వీలుంది. ఇదెక్క‌డ త‌న‌కు నెగిటివ్ గా మారుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న బాబు.. స్లో పాయిజ‌న్ మాదిరి.. కాంగ్రెస్ తో త‌న‌కున్న మైత్రీ బంధాన్ని నెమ్మ‌ది నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేస్తున్నార‌ని చెప్పాలి. ఇందులో భాగంగానే తాజాగా పారిశ్రామిక‌వేత్త‌ల‌తో రాహుల్ నిర్వ‌హించిన భేటీకి బ్రాహ్మ‌ణి హాజ‌ర‌య్యార‌ని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఎప్పుడూ త‌న రాజ‌కీయాల కోసం బ్రాహ్మ‌ణిని బ‌రిలోకి దించ‌ని బాబు..ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆమెను సీన్లోకి తీసుకురావ‌టం ద్వారా కాంగ్రెస్ తో త‌న‌కు పెరిగిన రిలేష‌న్ కు సంబంధించిన ఇండికేష‌న్ ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News