టీడీపీ బ్రహ్మాస్త్రంగా ఆమె... ?

Update: 2022-02-27 09:33 GMT
తెలుగుదేశం పార్టీకి చెక్కు చెదరని నాయకత్వం ఉంది. చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా టీడీపీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను, సంక్షోభాలను ఈ మధ్య కాలంలో చూసింది. అయినా చంద్రబాబు ఎక్కడా వెనకడుగు అయితే వేయలేదు. తన వ్యూహాలకు మరింత పదును పెట్టి ఎప్పటికి అపుడు పార్టీని ఫ్రంట్ లైన్ లో నిలబెడుతున్నారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీ పని అయిపోయింది అని కూడా అన్నారు. కానీ ఇపుడు చూస్తే ఏపీలో వైసీపీ గ్రాఫ్ ఒక వైపు తగ్గుతుంటే మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుంది అన్న చర్చ కూడా స్టార్ట్ అయింది.

ఇదిలా ఉంటే టీడీపీకి కొత్త జోష్ ని హుషార్ ని తీసుకురావడానికి ఎన్టీయార్ మనవరాలు, ప్రముఖ హీరో నందమూరి బాలక్రిష్ణ ముద్దుల తనయ, నారా వారి కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలన్న మాట అయితే పార్టీలో గట్టిగానే  ఉంది.

ఆమె ఎన్టీయార్ లెగసీని కంటిన్యూ చేసే సూపర్ లీడర్ అవుతారు అన్న నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసేవారున్నారు. బ్రాహ్మణి కనుక పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా పూర్తి స్థాయిలో నందమూరి ఫ్యాన్స్ కూడా పనిచెస్తారని, అది పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.

ఇక నందమూరి వంశాన్ని పక్కన పెట్టారు అని ప్రత్యర్ధి పార్టీల నుంచి వస్తున్న కామెంట్స్ కి కూడా తగిన తీరున జవాబు ఇచ్చినట్లు అవుతుంది అంటున్నారు. ఒక ఏపీలో టీడీపీకి చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయి. చురుకుగా తిరిగే యువ నాయకత్వం లోకేష్ రూపంలో ఉంది. కానీ స్టార్ కాంపెయినర్ గా పార్టీకి కొత్త గ్లామర్ తెచ్చే నాయకురాలిగా బ్రాహ్మణి రాక కోసం అయితే అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నది నిజం.

ఇక ఆమెను వచ్చే ఎన్నికల్లో గుడివాడలో పోటీకి పెట్టి వైసీపీ మంత్రి కొడాలి నానికి గుణపాఠం చెప్పాలన్న డిమాండ్ కూడా తమ్ముళ్ల నుంచి వస్తోంది. మరి దీని మీద అధినాయకత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది అన్నది ఇంకా తెలియడంలేదు. మరి వారి దృష్టిలో కూడా ఇలాంటి డిమాండ్స్ వచ్చి ఉండాలి. సరే చంద్రబాబుకు ఇలాంటివి తెలియవు అనుకోలేరు ఎవరూ. ఆయన ఎపుడు ఎవరిని ఎలా తీసుకురావాలి అన్న దాని మీద పక్కా క్లారిటీతో ఉంటారు.

ఇకపోతే బ్రాహ్మణికి రాజకీయాల మీద ఆసక్తి ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆమె మంచి విద్యావంతురాలు. అదే టైమ్ లో మంచి వ్యాపారవేత్త కూడా. ఆమె ఆ ఫీల్డ్ లోనే సక్సెస్ ఫుల్ గా కొనసాగుతారు. ఈ నేపధ్యంలో తాజాగా ఒక ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన బ్రాహ్మణిని మీడియా కలసి రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న వేసింది. దానికి బ్రాహ్మణి ఇచ్చిన జవాబు చాలా ఇంటెరెస్టింగ్ గా ఉందనే చెప్పాలి.

తాను వ్యాపార రంగం గురించి అడిగితే ఎన్ని అయినా చెబుతాను, రాజకీయాల గురించి మాత్రం తనకు ఏమీ తెలియదు అని చాలా సింపుల్ గా బ్రాహ్మణి జవాబు చెప్పేశారు. దాన్ని బట్టి ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అని అనుకోవాలి. లేదా తన భర్త లోకేష్, మామ చంద్రబాబు, తండ్రి బాలయ్య టీడీపీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు కదా, తాను ఎందుకు అని కూడా ఆలోచించి ఉండవచ్చు. మొత్తానికి ఆమె ఆన్సర్ మాత్రం రాజకీయాల గురించి ప్రశ్నలు వద్దు అనే.

సరే ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరూ కూడా ఇలాంటి వాటికి ఠక్కున జవాబు చెప్పేయలేరు. ఇక ఎన్నికలు చూస్తే రెండేళ్ళకు పైగా సమయం ఉంది. ఏపీలో ఈసారి టీడీపీ తిరిగి అధికారం సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక విధంగా చావో రేవో లాంటి పోరు ఇది. దాంతో టీడీపీ వద్ద ఉన్న అనేక అస్త్రాలలో బ్రహ్మాస్త్రంగా బ్రాహ్మణిని చూడాలి.

దాన్ని ఎపుడు ఏ సమయాన ప్రయోగించాలి అన్నది చంద్రబాబు కంటే ఎవరికీ ఎక్కువగా తెలిసి ఉండే ప్రసక్తే లేదు. అందువల్ల బ్రాహ్మణి తనకు రాజకీయాల గురించి ఆసక్తి లేదని చెప్పినా అది ఈ రోజుకు మాత్రమే అనుకోవాలి. సో టీడీపీ తరఫున అత్యంత శక్తివంతమైన ఆయుధంగా బ్రాహ్మణి ఉంది అన్నది వాస్తవం. ఆమె ఎంట్రీ ఎపుడైన జరగవచ్చు అన్నది కూడా అన్నది కూడా ప్రచారంలో ఉన్న విషయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News