తన చుట్టూ ఉండేదంతా రాజకీయ వాతావరణమే.అయినప్పటికీ.. తనకు రాజకీయాలంటే ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు లోకేశ్ శ్రీమతి.. చంద్రబాబు కోడలు బ్రాహ్మణిస్పష్టం చేశారు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆమె తాజాగా జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరై ప్రసంగించారు.
దాదాపు నాలుగు గంటల పాటు వేదిక మీద ఉన్న ఆమె.. సదస్సుకు హాజరు కావటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు మార్గదర్శకులు.. స్ఫూర్తిదారులు చాలామంది ఉన్నారని.. ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కొక్కరు స్ఫూర్తిదాతలుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సదస్సులు ఉపయోగపడుతాయని.. మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పాటును అందిస్తాయని చెప్పారు బ్రాహ్మణి.
రాజకీయాల్లోకి రానని.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పిన బ్రాహ్మణి.. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపించకపోవటం గమనార్హం. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చేసి.. అధికారాన్ని చేజిక్కించుకోవటంపై ఆసక్తి ప్రదర్శించే వారికి భిన్నంగా బ్రహ్మాణి తీరు ఉండటం విశేషం. ఇంతకీ.. రాజకీయాల్లోకి రావటం ఎందుకు ఇష్టం ఉండదన్న విషయాన్ని బ్రాహ్మణి చెబితే బాగుంటుందేమో.