తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో బాగా పాపులర్ అయిన హెరిటేజ్ ఉత్పత్తులు ఇకపై నార్త్ ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో దొరకనున్నాయి. ఉత్తరాదిలో హెరిటేజ్ ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ఈ సంస్థ ఢిల్లీలో ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న సమావేశంలో హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ నందమూరి బ్రాహ్మణి సంస్థ గురించి వివరించారు. సంస్థ సాధించిన ఘనతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.
తమ సంస్థ లక్ష్యం హెల్త్ అండ్ హేపీనెస్ అని చెప్పారు. ప్రతి ఇంట్లో గ్లాసుడు పాలను నవ్వుతూ అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆమె చెప్పారు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యం, ఆనందంలో భాగం కావాలని భావిస్తున్నామని ఆమె తెలిపారు. నాణ్యతే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. రోజూ 28 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని ఆమె తెలిపారు. వివిధ పాల ఉత్పత్తులను 10 లక్షల అవుట్ లెట్స్ కు అందిస్తున్నామని ఆమె తెలిపారు.
కాగా... ఇటీవలే నారా బ్రాహ్మణి తన ఉద్దేశాలను వివరించారు. తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని.. వ్యాపార విస్తరణపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు ఒక్కసారిగా తమ వ్యాపారాన్ని నార్త్ ఇండియాకు విస్తరించి నేషనల్ లెవల్ బ్రాండ్ గా మలచుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/