తాతా.. నాన్న.. మామ మాటల్ని చెప్పిన బ్రాహ్మణి

Update: 2017-02-11 09:46 GMT
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పలువురు ప్రముఖులు మాట్లాడటం తెలిసిందే. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడారు. పనిలోపనిగా తన తాత గురించి.. మామ గురించి పదేపదే ప్రస్తావించిన ఆమె.. తన తండ్రి ఇటీవల నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రను ప్రస్తావించారు. తమ ఇంట్లో మహిళా సాధికారత ఉందని చెప్పిన బ్రాహ్మణి.. మహిళల గురించి తన తాత ఎన్టీఆర్ చేసిన కృషిని ప్రస్తావించారు.

ఎన్టీఆర్ ను పదే పదే ‘అన్నగారు’ అంటూ ప్రస్తావిస్తూ.. ఆయన పాలనలో మహిళల కోసం తీసుకున్న నిర్ణయాల్ని ఆమెవెల్లడించారు. ఆ తర్వాత తన మామ.. ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  పాలన గురించి ఆమె గొప్పలు చెప్పటం కనిపించింది. డ్వాక్రా సంఘాల ఏర్పాటు.. దేశంలో మరే రాష్ట్రంలో లేని రికార్డు ఏపీ డ్వాక్రా సంఘాల మహిళలకు ఉందని పేర్కొన్నారు.

సదస్సు జరుగుతున్న అమరావతి గురించి చెబుతూ.. ఈ నేలను శాతకర్ణి పాలించారని.. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న గొప్పరాజు అంటూ శాతకర్ణి సినిమాలో ప్రస్తావించిన విషయాల్ని ఆమె చెప్పటం గమనార్హం. తన ప్రసంగంలో ఆసక్తికర అంశాల కంటే.. తనకుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ప్రస్తావనే ఎక్కువగా చేశారని చెప్పాలి. పెద్దవేదికల మీద స్పీచ్ లు ఇచ్చేటప్పుడు కాస్తంత కసరత్తు చేస్తే బాగుండేది. కనీసం ఇలాంటి వేదికల మీదనైనా సరే.. సొంతోళ్లను వీలైనంత తక్కువగా పొగిడితే.. కాస్త హుందాగా ఉంటుందన్న విషయాన్నిబ్రాహ్మణి గుర్తిస్తే మంచిది.

Full View
Tags:    

Similar News