రాజకీయాల్లో అసాధ్యమైనది ఏమీ ఉండదు. శత్రువులు మిత్రులుగా.. మిత్రులు శత్రువులుగా మార్చే గుణం రాజకీయానిదే. అవసరం పడాలే కానీ.. ఆ ఇంటి కాకి ఇట్టే వాలిపోతుంది. తాజాగా ఆ విషయం మరోసారి ఢిల్లీ వేదికగా నిరూపితమైంది. చంద్రబాబు అంటే చాలు పెద్దగా నచ్చని నరేంద్ర మోడీకి.. ఎట్టకేలకు ఆయనకు నచ్చినట్లుగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పాత స్నేహితుల మధ్య కొత్త స్నేహం వెల్లివిరిస్తుందన్న విషయాన్ని సంకేతంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు పొడను సైతం పెద్దగా ఇష్టపడని నరేంద్ర మోడీ.. అందుకు భిన్నంగా తానే దగ్గరకు తీసుకున్న వైనం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఏం జరిగిందో.. ఎందుకు జరిగిందన్నది హాట్ టాపిక్ గా మారేలా తాజాగా ఈ ఇద్దరు ముఖ్యనేతల మధ్య ఐదు నిమిషాల ప్రత్యేక భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన ఆజాదీకా అమ్రత్ మహోత్సవ్ సమావేశానికి హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమావేశానికి బాబును ఆహ్వానించటం.. ఆయన వెళ్లటం తెలిసిందే.
సమావేశ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ.. చంద్రబాబు నాయుడు ఇద్దరు ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తప్పించి.. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ మాట్లాడుకున్నది లేదు. 2014 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలతో పాటు.. జనసేన పార్టీని కలుపుకొని పోటీ చేయటం.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తనకంటే జూనియర్ అయిన మోడీ విషయంలో చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా మోడీ.. ఆయన్ను దూరం పెట్టేలా చేశాయని చెప్పాలి. మోడీ శక్తిసామర్థ్యాల్ని అంచనా వేసే విషయంలో ఫెయిల్ అయిన చంద్రబాబు అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.
తన రాజకీయ జీవితంలో ఆఖరి ఛాన్సుగా ఉన్న 2024 ఎన్నికల్ని ఏదో రీతిలో విజయం సాధించి.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకు తగ్గట్లుగా కొద్దిరోజులుగా తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలు తాజా పరిణామాల్ని చూస్తే.. వర్కువుట్ అయినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ.. జనసేన మధ్య పొత్తు ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ.. బాబును దూరంగా పెట్టే మోడీ.. ఆయన్ను దగ్గరకు తీసుకోవటం.. ప్రత్యేకంగా ఐదు నిమిషాలు కేటాయించటం చూస్తే.. కొత్త పొత్తుకు తెర తీసినట్లుగా భావించాలన్న మాట వినిపిస్తోంది.
ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు మరో ప్రశ్నగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ తో వెళ్లే అవకాశం లేకపోవటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తాను సొంతంగా పోటీ చేసి 151 సీట్లను సొంతం చేసుకున్న వేళ.. జగన్ కు బీజేపీని కలుపుకొని వచ్చే ఎన్నికల్లో వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉందంటే అది టీడీపీకి మాత్రమే. తాజాగా విపక్షంలో ఉండి.. అధికారం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా చంద్రబాబు మారిన వేళ..ఆయన్ను తమకు అనుకూలంగా మలుచుకోవటం పెద్ద కష్టం కాదన్నది మోడీషాల ప్లాన్ గా చెబుతారు. అందుకే.. చంద్రబాబుతో ప్రయాణాన్ని మొదలు పెట్టి.. జగన్ కు చెక్ చెప్పేలా ప్రణాళిక సిద్ధమైనట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు గతంలో మాదిరి కాకుండా.. మోడీతో స్నేహం కోసం చంద్రబాబు తపించటం.. ఇందుకోసం ఆయన చేసిన ప్రయత్నాలు మోడీ ఇగోను శాటిస్ ఫై చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే తాజా భేటీకి కారణమైందన్న మాట వినిపిస్తోంది.