విష‌యం చెప్పేస్తే.. టీడీపీ లైన్‌లో ప‌డుతుందా..?

Update: 2022-09-04 13:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లించిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ఆయ‌నెన్ని సార్లు చెప్పినా.. నాయ‌కులు మార‌డం లేదు. ఎవ‌రూ కూడా ప్ర‌జ‌ల బాట ప‌ట్ట‌డం లేదు. ఎవ‌రూ.. కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడడం లేదు. ఇదే విష‌యాన్ని తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన‌.. నాయ‌కుల స‌మీక్షలో చెప్పుకొచ్చారు. తాను ఎన్నిసార్లు చెప్పినా.. నాయ‌కులు వినిపించుకోవ‌డం లేద‌ని బాబు చెప్పుకొచ్చారు. త‌న ద‌గ్గర చాలా మంది నాయ‌కులు ఉన్నార‌ని, వారితో ప‌ని చేయించుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

ప‌నిలో ప‌నిగా ఎప్పుడూ.. చెప్పేదే.. ఆయ‌న చెప్పుకొచ్చారు. ప‌నిచేసేవారికే ప‌ద‌వులు ఇస్తాన‌న్నారు. అయి తే.. ఇప్పుడు కూడా నాయ‌కులు ముందుకు క‌దులుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  నాయ‌కుల్లో చ‌ల‌నం తెప్పించేందుకు ఏం చేయాలి? అనేది ఇప్పుడు పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప్ర‌ధానంగా.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చాలా మంది పార్టీలో ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నా రు. కొంద‌రు మాత్ర‌మే బ‌య‌టకు వ‌స్తున్నారు. ఈ ప‌రిణామాలు ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి.

దీనికి కొంద‌రు చెబుతున్న విష‌యం ఏంటంటే.. పార్టీకి ద‌శ దిశ లేకుండా పోయిందనే! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కొంద‌రు నాయ‌కులు ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీ అనుస‌రించ‌బోయే వ్యూహంపై నాయకులు ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ``మేం క‌ష్ట‌ప‌డ‌తాం. బాగానేఉంది. కానీ, పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది? అనేది సందేహంగా ఉంది. ఇంతా క‌ష్ట‌ప‌డి వేరే వారికి ప్ర‌చారం చేయ‌డం ఎందుకు?`` అని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే చెబుతున్నారు.

దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్తారా?  లేక పొత్తులు ఉంటాయా?  ఉంటే.. ఎలా ఉంటాయి? ఏయే స్థానాల‌ను పొత్తు పార్టీల‌కు కేటాయిస్తారు?  వంటి విష‌యాల్లో క్లారిటీ ఇస్తే బెట‌ర్ అనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను టీడీపీవైపు తిప్పుకోవాలంటే బ‌ల‌మైన ప‌థ‌కాలను ప్ర‌క‌టించాలనే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇవి లేక‌పోవ‌డం వ‌ల్లే.. పార్టీలో నాయ‌కులు ముందుకు సాగ‌డం లేద‌ని.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు దృష్టి పెడితే మేల‌ని కొంద‌రు సూచిస్తున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News