చిన్నపిల్లల విద్యాభాస్యానికి ముందు అక్షరాభాస్యాన్ని నిర్వహిస్తుంటారు. తాజాగా అలాంటి ముచ్చటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో జరిగింది. చంద్రబాబు మనమడు దేవాన్ష్ అక్షరాభాస్యం కార్యక్రమాన్ని తిరుమలలో జరిపారు. సకుటుంబ సమేతంగా.. దగ్గర బంధువుల నడుమ అక్షరాభాస్యం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంత సముదాయంలో దేవాన్ష్ అక్షరాభాస్యం జరిగింది.
తాత.. నానమ్మలైన చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరిలు మనమడికి దగ్గరుండి అక్షరాలు రాయించారు. పలక మీద బలపంతో మనమడి చేత చంద్రబాబు రాయించిన మొదటి అక్షరాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి.
అ.. ఆ రెండు అక్షరాల్ని.. తనదైన శైలిలో రాయించారు చంద్రబాబు.
అ.. అమ్మ.. ఆ.. ఆంధ్రప్రదేశ్.. అ.. అమరావతి.. ఆ.. ఆరోగ్యంం.. ఆ.. ఆనందం.. ఆ.. ఆదాయం అంటూ రాయించి.. వాటిని మూడుసార్లు దిద్దించారు. తాను నిత్యం చెప్పే అమరావతిని.. తాను పాలించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును అమ్మ పేరు తర్వాత రాయించటం అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. అనంతరం సకుటుంబ సమేతంగా వైకుంఠం 1 క్యూలైన్ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి.. స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అక్కడి పండితులు వేదాశీస్సులు అందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/