తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ ఇక నేరుగా రంగంలోకి దిగనున్నారు. తెర వెనుక రాజకీయం నుంచి తెరపైకి రానున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పుడు జగన్ లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. గడపగడపకూ వైసీపీ పేరుతో జనంలోకి వెళుతున్న జగన్ లక్ష్యంగా - లోకేష్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పైనుంచి కింది స్థాయి నేతల వరకూ అందరికీ శిక్షణ శిబిరాలు నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఏర్పడిన కమిటీ శుక్రవారం లోకేష్ నాయకత్వాన భేటీ అయిన సంగతి తెలిసిందే. తొలిసారి లోకేష్ ఆధ్వర్యాన వ్యూహబృందం తన భవిష్యత్తు కార్యాచరణకు మెరుగులు దిద్దింది. ఇక దీనితో పార్టీలో లోకేష్ శకం మొదలయినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
యనమల మినహా సీనియర్లంతా హాజరైన ఈ సమావేశంలో ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, మొదట కింద నుంచి పైస్థాయి వరకూ శిక్షణ తరగతులు నిర్వహించి, అక్కడి నుంచే వారికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగా రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని అంశాల్లో విజయం సాధించిన 25 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకుని, వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే - ఇంఛార్జిలు - 25 పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని ఎంపిలు - ఇంఛార్జిలు - నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన 500 మంది నేతలు - ఐదువేలమంది ఎంపిటిసి - జడ్పీటీసీలు - సర్పంచులు - ఇప్పటికే శిక్షణ పొందిన 32500 మంది నేతలకు అక్టోబర్ లోగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో గడప గడపకు వైసీపీ నినాదంతో జనంలోకి వెళుతున్న ఆ పార్టీ అధినేత జగన్ ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా లోకేశ్ కసరత్తు చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా జగన్ చేతిలో మీడియా ఉండడంతో ఆయన కార్యక్రమాలను ప్రచారం చేస్తారని.. అదేసమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినా, ఎన్నో కార్యక్రమాలు చేసినా సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నారన్న ఉద్దేశంలో లోకేశ్ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఫుల్లుగా ప్రచారం చేసే బాధ్యతలను సీనియర్లు చేపట్టాలని కూడా లోకేశ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ గడపగడపకూ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ చేసే ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టడమే లక్ష్యంగా సాగాలన్నది లోకేశ్ వ్యూహంగా తెలుస్తోంది.