బాబు ఆస్తుల చిట్టా... బాలయ్యను బుక్ చేసి పారేశారే

Update: 2020-02-22 04:15 GMT
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల చిట్టాలో ఈ దపా చాలా జిమ్మిక్కులే జరిగాయన్న ప్రచారం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ జిమ్మిక్కుల్లో బాబు ఫ్యామిలీ మెంబర్ల పరిస్థితి ఎలా ఉన్నా... ఈ ఆస్తుల చిట్టాతో ఎలాంటి సంబంధం లేని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అడ్డంగా బుక్కైపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బాబు ఫ్యామిలీకి చెందిన ఆస్తుల చిట్టాను ఏటా విడుదల చేస్తున్నప్పటికీ... ఏనాడూ బాలయ్య ప్రస్తావన రాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం బాబు అల్లుడు నారా లోకేశ్ తమ ఫ్యామిలీ ఆస్తుల చిట్టాను విడుదల చేసిన సందర్భంగా తన కుమారుడు దేవాన్ష్ పేరిట లెక్కలేనంత మేర ఆస్తులు పోగైనట్టు ప్రకటించారు. అందుకు కారణాలు కూడా చెప్పాలి కదా. అందులో భాగంగా దేవాన్ష్ కు తాత నుంచి భారీ సంఖ్యలో హెరిటేజ్ షేర్లు దానంగా బదిలీ అయినట్లుగా లోకేశ్ చెప్పుకొచ్చారు.

 ఇక్కడి దాకా బాగానే ఉన్నా... తాత అంటే ఎవరు? చంద్రబాబునాయుడే కదా. మరి తనకు హెరిటేజ్ తో ఎంతమాత్రం సంబంధం లేదని, హెరిటేజ్ లో తనకు చిల్లిగవ్వ ఆస్తి కూడా లేదని, సింగిల్ షేరు కూడా లేదని చంద్రబాబు నిత్యం చెబుతూనే ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు హెరిటేజ్ లో తనకు లేని షేర్లను చంద్రబాబు తన మవనడు దేవాన్ష్ కు ఎలా దానం చేస్తారు? లాజిక్కే మరి. లేని షేర్లను దానం చేయడం సాధ్యం కాదు కదా. మరేం చేయాలి? ఇక్కడే చంద్రబాబు అనుకూల మీడియా ఓ దుస్సాహసం చేసింది. బాబు ఆస్తుల చిట్టాలో బాలయ్యను అడ్డంగా బుక్ చేసి పారేసింది. మరి బాలయ్య ఈ వ్యవహారం నుంచి ఎలా బయట పడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బాబు ఆస్తుల చిట్టాలో బాలయ్యను ఇరికించేసిన వైనంతో బాబు ఆస్తుల చిట్టాలో విశ్వసనీయత ఏపాటితో కూడా ఇట్టే తేలిపోయిందన్న వాదనలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.

అయినా బాలయ్యను ఈ వివాదంలోకి ఎలా లాగేశారన్న విషయానికి వస్తే...  దేవాన్ష్ కు తాత అంటే చంద్రబాబు మాత్రమే కాదు కదా. బ్రాహ్మణికి తండ్రి అయిన బాలయ్య.. దేవాన్ష్ కు తల్లి వరుస తాత కూడా కదా. ఇక్కడే బాబు అనుకూల మీడియా తనదైన శైలి విన్యాసం చేసింది. బాబుకు హెరిటేజ్ లో షేర్లు లేని మాట వాస్తవమే. అయితే బాలయ్యకు హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయి. ఆ షేర్లను బాలయ్య తన మనవడు దేవాన్ష్ కు దానంగా బదలాయించారు అంటూ ఎల్లో మీడియా కథనాలు రాసి పారేసింది. సరే... దేవాన్ష్ కు తాతగా బాలయ్య తన హెరిటేజ్ షేర్లను బదలాయించారే అనుకుందాం. మరి బాలయ్యకు హెరిటేజ్ లో షేర్లు ఉండాలి కదా. అవే ఉంటే మొన్నటి ఎన్నికల్లో బాలయ్య వాటిని తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించాలి కదా. మరి ఎన్నికల అఫిడవిట్ లో బాలయ్య తన ఆస్తులను పేర్కొన్నారు గానీ, అందులో హెరిటేజ్ షేర్లను ప్రస్తావించలేదు కదా. అంటే బాలయ్యకు హెరిటేజ్ షేర్లు ఉన్నా గానీ.. వాటిని ఎన్నికల కమిషన్ కు తెలపకుండా బాలయ్య నేరానికి పాల్పడి ఉండాలి. అప్పుడు ఆయనపై అనర్హత వేటు పడుతుంది కదా. ఇలా బాలయ్య ను ఎల్లో మీడియా అడ్డంగా బుక్ చేస్తే... దాని నుంచి ఆయన ఎలా బయట పడతారో చూడాలి.
Tags:    

Similar News