తండ్రుల్ని పక్కాగా ఫాలో అవుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కుమారులు. ఇరువురు అధినేతల రాజకీయ వారసులుగా అందరూ భావించే వీరిద్దరూ తమ తండ్రుల మాదిరే కొన్ని విషయాల్ని తూచా మాట్లాడుతున్న వైనం తాజాగా మరోసారి నిరూపితమైందని చెప్పాలి. రాజకీయంగా ఎన్ని పంచాయితీలు ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలకు మినహాయింపులు ఇస్తున్న వైనాన్ని తాజాగా లోకేశ్ ఫాలో అయ్యారని చెప్పాలి.
విభజన అనంతరం రెండు రాష్ట్రాల అధికారపక్షాల మధ్య రాజకీయ విబేధాలు ఉన్నప్పటికీ.. ఇద్దరు చంద్రుళ్ల పుట్టినరోజు సందర్భంగా మాత్రం ఫోన్లలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం.. ట్వీట్లు చేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా ఇదే వైనాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఫాలో అయ్యారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి అయిన కేటీఆర్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ రాష్ట్ర మంత్రి లోకేశ్. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేసి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. లోకేశ్ ట్వీట్‌కు వెంటనే రియాక్ట్ అయ్యారు కేటీఆర్. తనకు గ్రీటింగ్స్ చెప్పిన ట్వీట్ కు రిట్వీట్ చేస్తూ.. థ్యాంక్స్ చెప్పిన ఆయన.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం కలిసి పని చేద్దామంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తండ్రుల మధ్య రిలేషన్ ముచ్చట తర్వాత.. కొడుకుల మధ్య ఈ కొత్త రిలేషన్ ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.